Ben Stokes Retirement: ఇంగ్లాండ్ క్రికెట్లో ప్రకంపనలు.. ఇకనైనా మేల్కొనండంటూ బట్లర్ సంచలన వ్యాఖ్యలు

తీరిక లేని క్రికెట్ షెడ్యూల్ కారణంగా వన్డే క్రికెట్ నుంచి బెన్ స్టోక్స్ అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించడం ఇంగ్లాండ్ క్రికెట్లో ప్రకంపనలు రేపుతుంది. ఇక తాజాగా ప్రస్తుత ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ జాస్ బట్లర్ ఈ విషయమై సంచలన వ్యాఖ్యలు చేశాడు. బెన్ స్టోక్స్ రిటైర్మెంట్ నిర్ణయం కచ్చితంగా ఇంగ్లాండ్ క్రికెట్‌కు 'మేలుకొలుపు' లాంటిదని, ఇంగ్లాండ్ టీం షెడ్యూళ్లు ఇంత బిజీబిజీగా ఉంచడమేంటోనని జాస్ బట్లర్ అభిప్రాయపడ్డాడు. అతను సూటిగా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డును ప్రశ్నించినట్లు ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
31ఏళ్ల వయసులోనే స్టోక్స్ అన్ని ఫార్మాట్లలో ఆడడానికి కుదరడం లేదని అందువల్ల వన్డే ఫార్మాట్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నానని తెలిపాడు. స్టోక్స్ తన వన్డే కెరీర్లో 104మ్యాచ్‌లు ఆడాడు. 38.98సగటుతో 2924 పరుగులు చేశాడు. ఇక 2019లో ఇంగ్లాండ్ వన్డే ప్రపంచ కప్ గెలవడంలో స్టోక్స్ కీలక పాత్ర పోషించాడు. వన్డేల్లో స్టోక్స్ 3సెంచరీలు, 21హాఫ్ సెంచరీలు చేశాడు.

ఆషామాషీ క్రికెటర్ కాదు
ఇక జాస్ బట్లర్ మాట్లాడుతూ.. 'బెన్ స్టోక్స్ నిర్ణయం కచ్చితంగా ఒక మేలుకొలుపు లాంటిదే. ఎందుకంటే బెన్ స్టోక్స్ ఆషామాషీ క్రికెటర్ కాదు. ప్రపంచ క్రికెట్‌లో అత్యంత గుర్తింపు పొందిన ఆటగాళ్లలో బెన్ స్టోక్స్ ఒకడు. ప్రతి ప్లేయర్.. ప్రతి ఫార్మాట్‌లో ఆడాలని కోరుకుంటారు. అంతర్జాతీయ క్రికెట్‌లో జట్టు తరఫున అత్యుత్తమ ప్లేయర్లు ఆడాలని కోరుకుంటాం. కానీ షెడ్యూళ్ల వల్ల కాస్త కష్టమవుతుందనేది వాస్తవమే' అని స్టోక్స్ మంగళవారం తన చివరి వన్డే ఆడిన తర్వాత బట్లర్ విలేకరుల సమావేశంలో చెప్పాడు.

ఇది చేదు వార్తే
"ఇంగ్లాండ్ క్రికెట్ అభిమానులకు ఇది చేదు వార్త. వన్డే ఫార్మాట్‌కు బెన్ స్టోక్స్ అందుబాటులో లేడనే బాధ ఉంటుంది. కానీ వన్డే క్రికెట్‌లో స్టోక్స్ మిస్సయినా.. కచ్చితంగా టెస్ట్ క్రికెట్‌లో ఇంగ్లాండ్ అతని వల్ల లాభపడుతుంది. నా ప్రకారం అతని అభిమాన ఫార్మాట్ టెస్ట్. అదే అతనికి ప్రాధాన్యం. ఇక ఇప్పుడు అతను టెస్ట్ కెప్టెన్‌గా ఉన్నాడు. అతను టెస్ట్ క్రికెట్లో సుదీర్ఘకాలం ఆడతాడని నేను అనుకుంటున్నాను' అని బట్లర్ వెల్లడించాడు.

మేమేం కార్లు కాదు పెట్రోల్ పోసి నడిపించడానికి..
2019 ప్రపంచకప్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టులో అత్యంత ప్రభావవంతమైన ప్లేయర్ స్టోక్స్. బిజీ షెడ్యూళ్ల వల్ల వన్డే ఫార్మాట్లో అతను తన 100శాతం ఆటను ఇవ్వలేకపోతున్నానని అందుకే తన స్థానంలో మరో మంచి ప్లేయర్ ఆడితే బాగుంటుందని స్టోక్స్ పేర్కొంటూ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక స్టోక్స్ ప్రెస్ మీట్లో సైతం పలు సంచనల వ్యాఖ్యలు చేశాడు.
'మేమేం కార్లు కాదు. పెట్రోల్ పోసి నింపి ఎక్కడికంటే అక్కడికి వెళ్లడానికి. మేం తీరిక లేని క్రికెట్ ఆడాల్సొస్తుంది. మా జట్టు ఓ టెస్ట్ సిరీస్ ఆడుతున్నప్పుడే వన్డే జట్టు మరో సిరీస్‌ను ఆడుతుంది. నాకనిపించింది షెడ్యూల్ ఇంత టైట్‌గా ఎందుకు చేస్తున్నారని.' అని స్టోక్స్ బీబీసీ ఇంటర్వ్యూలో తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications