T20 World Cup 2022: జోస్ బట్లర్ ఖాతాలో మరో రికార్డు.. ఇంగ్లాండ్ తరుఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ..

ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లాండ్ తరుఫున టీ20 మ్యాచ్ ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. జోస్ బట్లర్ 92 ఇన్నింగ్స్ ల్లో 2459 పరుగులు చేశాడు. అతని తర్వాత ఇయాన్ మోర్గాన్ 107 ఇన్నింగ్స్ ల్లో 2458 పరుగులు చేశాడు. అలెక్స్ హెల్స్ 1888, డెవిడ్ మలన్ 1745, జాసన్ రాయ్ 1522 పరుగులు చేశాడు. బట్లర్ న్యూజిలాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఈ ఘనత సాధించాడు.
అలెక్స్ హెల్స్
బ్రిస్బేన్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. ఓపెనర్లు జోస్ బట్లర్, అలెక్స్ హెల్స్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. హెల్స్ 40 బంతుల్లో ఒక సిక్స్, 7 ఫోర్లతో 52 పరుగులు చేశారు. జోస్ బట్లర్ 47 బంతుల్లో 2 సిక్స్ లు, 7 ఫోర్లతో 73 పరుగులు చేశాడు. మొయిన్ అలీ 5 పరుగులు చేయగా.. లివింగ్ స్టోన్ 20 పరుగులు చేశాడు. బ్రూక్ 7, బెన్ స్టోక్స్ 8, సామ్ కరన్ 6, డెవిడ్ మలన్ 3 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.
ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్
కివీస్ బౌలర్లలో ఫర్గ్ సన్ రెండు వికెట్లు తీయగా.. టిమ్ సౌథీ, ఇష్ సోధీ, సాట్నర్, ఒక్కో వికెట్ తీశారు. గ్రూప్-1 నుంచి న్యూజిలాండ్ 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో 5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. రన్ రేట్ 3.850గా ఉంది. కివీస్ సెమీస్ రేసులో ముందుండగా.. రెండో బెర్త్ కోసం ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఆఫ్ఘానిస్తాన్ పై విజయం సాధించిన శ్రీలంక కూడా సెమీస్ రేసులో ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications