For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

14 ఏళ్ల ఆటగాడిలో యువరాజ్, లారాను చూశాను: స్టార్ క్రికెటర్

Vaibhav Suryavanshi: ఇంగ్లాండ్ వికెట్ కీపర్, బ్యాటర్ జోస్ బట్లర్.. రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన 14 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ శైలిపై ప్రశంసల వర్షం కురిపించారు. వైభవ్ బ్యాటింగ్‌ను భారత దిగ్గజ క్రికెటర్ యువరాజ్ సింగ్, వెస్టిండీస్ లెజెండ్ బ్రియాన్ లారాలతో పోల్చారు. వైభవ్ బ్యాట్ స్వింగ్ వారిద్దరిలాగే అద్భుతంగా, క్లాసిక్‌గా ఉంటుందని జోస్ బట్లర్ అన్నారు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ.. 14 ఏళ్ల వయసులో ఐపీఎల్ లోకి అడుగుపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఏప్రిల్ 19, 2025న లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ రాజస్థాన్ తరఫున అరంగేట్రం చేశాడు. అప్పుడు వైభవ్ సూర్యవంశీ వయస్సు కేవలం 14 సంవత్సరాల 23 రోజులు మాత్రమే. ఐపీఎల్ చరిత్రలో అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు.

జోస్ బట్లర్ ప్రశంసలు.. స్టువర్ట్ బ్రాడ్ ఆశ్చర్యం
జోస్ బట్లర్ ఇటీవల స్టువర్ట్ బ్రాడ్‌తో కలిసి చేసిన ఓ పాడ్‌కాస్ట్‌లో వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్‌ను ఎంతగానో మెచ్చుకున్నారు. క్రీజులోకి రాగానే తొలి బంతికే లాంగ్-ఆఫ్ మీదుగా అద్భుతమైన సిక్సర్ కొట్లాడని జోస్ బట్లర్ చెప్పారు. తన అరంగేట్ర ఇన్నింగ్స్‌లో 20 బంతుల్లో 34 పరుగులు చేసి క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టించాడని అన్నారు. ఈ సందర్భాన్ని గుర్తుచేసుకున్న స్టువర్ట్ బ్రాడ్.. రాజస్థాన్ రాయల్స్ 14 ఏళ్ల ఆటగాడిని కొనుగోలు చేసిందని తెలిసినప్పుడు తాను ఆశ్చర్యపోయానని బట్లర్‌తో అన్నాడు. "ఇది ప్రొఫెషనల్ క్రికెట్, కానీ వైభవ్ సూర్యవంశీ కేవలం 14 ఏళ్ల కుర్రాడు. వైభవ్ సెంచరీ కొట్టినప్పుడు మీరు వికెట్ కీపింగ్ చేస్తున్నారని నాకు గుర్తుంది, ఆ సెంచరీ గురించి ప్రపంచమంతా చర్చించుకుంది, ఆ సెంచరీ గురించి నాకు చెప్పండి" అని స్టువర్ట్ బ్రాడ్ కోరాడు.

Jos Buttler Hails 14-Year-Old Vaibhav Suryavanshi Compares Him to Yuvraj Singh and Brian Lara

కేవలం 35 బంతుల్లోనే ఐపీఎల్ సెంచరీ
ఏప్రిల్ 28, 2025న గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన శతకాల్లో ఒకటి సాధించాడు. వైభవ్ కేవలం 35 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి, మొత్తంగా 38 బంతుల్లో 101 పరుగులు చేశాడు. వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్‌లో భారీ సిక్సర్లు ఉన్నాయి. వైభవ్ సూర్యవంశీ మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, రషీద్ ఖాన్ వంటి అంతర్జాతీయ బౌలర్ల బౌలింగ్ లో కూడా బౌండరీలు బాదాడు.

జోస్ బట్లర్ మాట్లాడుతూ.. "ఈ కుర్రాడు నాకంటే 20 ఏళ్లు చిన్నవాడు, కానీ మమ్మల్ని మైదానం నలుమూలలా కొడుతున్నాడు. అతను కేవలం సిక్సర్లు కొడుతున్నాడు, అదీ భారీ సిక్సర్లు. వైభవ్ సాధారణ బౌలర్లపైనే కాదు, ప్రపంచంలోని అత్యుత్తమ టీ20 బౌలర్ రషీద్ ఖాన్‌ బౌలింగ్‌లో కూడా అద్భుతమైన షాట్లు ఆడాడు. ఇంతటి ప్రమాదకరమైన బౌలర్ల బౌలింగ్‌లో వైభవ్ తన ఇష్టం వచ్చినట్లు సిక్సర్లు కొట్టడం, లేదా సులభంగా పరుగులు రాబట్టడం చూసి నేను ఆశ్చర్యపోయాను" అని అన్నారు. వైభవ్ బ్యాట్ స్వింగ్ పూర్తిగా యువరాజ్ సింగ్, బ్రియాన్ లారా లాగా ఉందన్నారు. వైభవ్ టెక్నిక్, ఆత్మవిశాసం చూసి ఆశ్చర్యపోయానని జోస్ బట్లర్ అన్నారు.

ఇదిలా ఉండగా.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో జరిగిన మరో మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ వంటి బౌలర్ల బౌలింగ్‌లో కూడా సులభంగా పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ అత్యంత ఆకట్టుకునే ఆటగాడు అని జోస్ బట్లర్ పేర్కొన్నాడు.

Story first published: Wednesday, June 18, 2025, 12:36 [IST]
Other articles published on Jun 18, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+