ENGvsPAK: ప్రపంచకప్ నెగ్గిన తర్వాత బట్లర్ చేసిన పని వైరల్.. వావ్ అంటున్న ఫ్యాన్స్!

పొట్టి ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ జట్టు విశ్వవిజేతలుగా నిలిచింది. ఫైనల్‌లో పాకిస్తాన్‌ను చిత్తుచేసిన ఆ జట్టు ఈ ఫార్మాట్‌లో రెండో ట్రోఫీని ముద్దాడింది. ఈ విజయంతో ఆ జట్టు మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. ఈ సందర్భంగా ఇంగ్లండ్ సారధి జోస్ బట్లర్ చేసిన ఒక పని నెటిజన్ల దృష్టికి వచ్చింది. అది చూసిన అందరూ బట్లర్‌ను మెచ్చుకుంటున్నారు.
చరిత్ర సృష్టించిన బట్లర్
ఇంగ్లండ్ మాజీ సారధి ఇయాన్ మోర్గాన్ సడెన్‌గా రిటైర్ అవడంతో వైట్ బాల్ క్రికెట్‌లో బట్లర్‌ను కెప్టెన్ చేశారు. సారధిగా భారత్‌తో ఆడిన సిరీస్‌లో బట్లర్ ఏమాత్రం ప్రభావం చూపలేదు. దీంతో అతన్ని చాలా మంది విమర్శించారు. కెప్టెన్‌గా పనికిరాడన్నారు. కానీ ఆ విమర్శకుల నోళ్లు మూయించేలా ప్రపంచకప్ ముద్దాడి చరిత్ర సృష్టించాడు బట్లర్.
గెలిపించిన స్టోక్స్
పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్‌లో లక్ష్యం స్వల్పమే అయినా.. కీలక సమయాల్లో ఇంగ్లండ్ వికెట్లు కోల్పోవడంతో అభిమానులు ఆందోళన చెందారు. అయితే వికెట్లు పడుతున్నా కూడా ప్రశాంతంగా నిలబడిన బెన్ స్టోక్స్ (52 నాటౌట్) జట్టును విజయం దిశగా తీసుకెళ్లాడు. అతను ఒక ఎండ్‌లో పాతుకుపోవడంతో మొయీన్ అలీ వంటి వారికి ధాటిగా ఆడే అవకాశం దక్కింది. దీంతో ఆ జట్టు విజయం సాధించింది.
రషీద్, అలీ కోసం వెయిట్
విక్టరీ సెలబ్రేషన్స్‌ను ఛాంపేన్ బాటిల్‌తో చేసుకోవడం అనేది చాలా పాశ్చాత్య దేశాలకు అలవాటే. ఇంగ్లండ్ కూడా ఇదే చేసింది. అయితే ముస్లింలు అయిన మొయీన్ అలీ, అదిల్ రషీద్ మద్యం ముట్టరు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఛాంపేన్ సెలబ్రేషన్స్ కన్నా ముందు తమ జట్టు మొత్తాన్ని పిలిచిన బట్లర్.. ఫొటోలు దిగాడు. ఆ తర్వాత ఛాంపేన్ గురించి చెప్పి అలీ, రషీద్‌ను పక్కకు పంపించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
గతంలో కమిన్స్ కూడా
గతేడాది ఆస్ట్రేలియా టెస్టు సారధి ప్యాట్ కమిన్స్ కూడా ఇలాగే చేశాడు. విక్టరీ సెలబ్రేషన్స్‌లో ఛాంపేన్ తీసుకురాగానే ఉస్మాన్ ఖవాజాను పిలిచి, పక్కకు పంపించాడు. ఆ తర్వాతనే ఛాంపేన్ బాటిల్ ఓపెన్ చేశాడు. ఇలా క్రికెట్‌కు మతంతో పనిలేదని ఈ ఆటగాళ్లు నిరూపిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications