Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SA20 : దంచికొట్టిన ఓపెనర్లు.. బాస్ ఫైటింగ్ వృధా!

 Jos Buttler failed to save Royals in SA20

క్రికెట్‌లో ఒక టీంలో ఒకరో ఇద్దరో ఆడితే జట్టు గెలవడం కష్టం. ఇదే విషయం మరోసారి రుజువైంది. సౌతాఫ్రికా టీ20 లీగులో భాగంగా జరిగిన మ్యాచ్‌లో భారీ లక్ష్య ఛేదనలో పార్ల్ రాయల్స్ చిత్తుగా ఓడింది. జోస్ బట్లర్ (70), ఇయాన్ మోర్గాన్ (24) పోరాడినా తమ జట్టున గెలిపించుకోలేకపోయారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పార్ల్ రాయల్స్‌కు బంతితో శుభారంభం దక్కలేదు.

ప్రిటోరియా క్యాపిటల్స్ ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (39), కుశాల్ మెండిస్ (80) ఇద్దరూ ప్రత్యర్థి బౌలర్లపై ఆరంభం నుంచే ఎదురు దాడికి దిగారు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ డి బ్యూన్ (12), రైలీ రూసో (13) పెద్దగా రాణించలేదు. అయితే కోలిన్ ఇన్‌గ్రాం (41), జిమ్మీ నీషమ్ (22 నాటౌట్) ఇద్దరూ చివర్లో మెరుపులు మెరిపించారు. దీంతో ప్రిటోరియా క్యాపిటల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోరు సాధించింది. రాయల్స్ బౌలర్లలో లుంగి ఎన్గిడీ రెండు వికెట్లతో రాణించగా.. కోడి యూసుఫ్, పెహ్లుక్వాయో చెరో వికెట్ తీసుకున్నారు.

లక్ష్య ఛేదనలో రాయల్స్‌కు శుభారంభం దక్కలేదు. జేసన్ రాయ్ (10), పాల్ స్టిర్లింగ్ (19) ఇద్దరూ స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరారు. అయితే జోస్ బట్లర్ (70) వేగంగా ఆడాడు. అతనికి ఇయాన్ మోర్గాన్ (24) కాసేపు సహకారం అందించాడు. మిగతా బ్యాటర్లు మిచెల్ వాన్ డర్ బూరెన్ (5), డేవిడ్ మిల్లర్ (11), పెహ్లుక్వాయో (3), ఇవాన్ జోన్స్ (0), ఇమాద్ ఫోర్టూయిన్ (8), కోడి యూసుఫ్ (2 నాటౌట్), ఎన్గిడీ (2 నాటౌట్) ఎవరూ మంచి స్కోరు చెయ్యలేకపోయారు. దీంతో రాయల్స్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 167 పరుగులు మాత్రమే చేయగలిగింది. తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతంగా రాణించిన కుశాల్ మెండిస్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.

Story first published: Wednesday, February 8, 2023, 11:25 [IST]
Other articles published on Feb 8, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+