ఓ టైం లేదు.. పాడు లేదు, ఇలాగైతే ఇంకెక్కడ గెలుస్తాం : జాస్ బట్లర్ సీరియస్ వ్యాఖ్యలు

ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించినప్పటి నుంచి.. ఐసీసీ ప్రతిపాదించిన బిజీ షెడ్యూల్ విషయమై తీవ్ర విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఆల్ ఫార్మాట్ ప్లేయర్లు తగినంత విరామాన్ని పొందడానికి వీలు కావడం లేదని అపవాదు వస్తోంది. ఇక ఐసీసీ కఠినమైన షెడ్యూల్‌ను రూపొందించినందుకు పలువురు క్రికెట్ ప్రముఖులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ షెడ్యూల్ వల్ల ప్లేయర్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని, వారి అత్యుత్తమ ప్రదర్శన చేయలేకపోతున్నారని కామెంట్లొచ్చాయి. మాజీలే కాకుండా ప్రస్తుత క్రికెటర్లు సైతం ఈ విషయమై తమ వాణి వినిపించారు. తాజాగా ఇంగ్లాండ్ వైట్-బాల్ కెప్టెన్ జోస్ బట్లర్ సైతం పెదవి విప్పాడు.

శిక్షణకు టైం సరిపోవడం లేదు
ఇటీవల భారత్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే, టీ20 సిరీస్‌లలో ఇంగ్లాండ్ ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. తర్వాత దక్షిణాఫ్రికాతో ద్వైపాక్షిక వన్డే సిరీస్ సైతం 1-1తో సమమైంది. మూడో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అవ్వడంతో సిరీస్ ట్రోఫీని ఇరు జట్ల కెప్టెన్లు అందుకున్నారు. ఇక ఈ సిరీస్ అనంతరం జాస్ బట్లర్ పలు సీరియస్ వ్యాఖ్యలు చేశాడు. ప్లేయర్లకు సరైన శిక్షణ ఇచ్చేందుకు టైం సరిపోవడం లేదని పేర్కొన్నాడు. అందువల్ల సిరీస్‌లు గెలవలేకపోతున్నామని పేర్కొన్నాడు.

ప్రాక్టీస్ బట్టే ప్రదర్శన ఉంటుంది
'మేము ఎంత బాగా ప్రాక్టీస్ చేశామన్న విషయమే.. మ్యాచ్‌లో మేం ఏ మేరకు ప్రదర్శన చేయగలుగుతామన్నది డిసైడ్ చేస్తుంది. ప్రాక్టీస్ అనేది మా ఆటకు చాలా ముఖ్యం. మేం ప్రాక్టీస్‌ను మిస్ అవుతున్నప్పుడు నిరాశ కలుగుతుంది. ఈ నెల మొత్తం మా మ్యాచ్‌ల షెడ్యూళ్ల వల్ల అలాగే జరిగింది. మాకంటూ సరైన ప్రాక్టీస్ టైం దక్కలేదు. ఇక ఇలాంటి ఫిక్స్ డ్ షెడ్యూల్స్ ఉంటే.. అందుకు తగ్గట్టు ఓ మార్గాన్ని కనుగొనాలి. లేకుంటే మ్యాచ్‌లో ఫలితం విషయంలో దెబ్బపడుతోంది.' అని బట్లర్ చెప్పాడు.

ఒత్తిడి టైంలో ఎలా వ్యవహరించాలో తెలుస్తుంది
ఇకపోతే ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్‌లో దూకుడు విధానాన్ని అనుసరిస్తూ.. సక్సెస్ ఫుల్ టీంగా ఎదుగుతుంది. కానీ పరిమిత ఓవర్ల సిరీస్లలో మాత్రం ఆ జట్టు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతుంది. శిక్షణకు తగినంత టైం దొరక్కపోవడం వల్ల కలుగుతున్న అసౌకర్యాల గురించి బట్లర్ స్పందించాడు. మ్యాచ్ టైంలో ఒత్తిడి ఎదురైనప్పుడు ఎలా వ్యవహరించాలనేదానిపై కూడా ప్రాక్టీస్ అవసరమవుతుంది. వారి పరిమితులను అనుసరించి తమను తాము మల్చుకోవడంలో ప్లేయర్లకు సరైన ప్రాక్టీస్ ఉపయుక్తమవుతుంది' అన్నాడు.

జట్టులో ఇతర ప్లేయర్లతో ర్యాపో కూడా కావాలిగా..
'మంచి కమ్యూనికేషన్ కూడా జట్టులో అవసరం. పరిస్థితులకు తగ్గట్లు అనుభూతి చెందుతూ సాధన చేస్తే బెటర్. కానీ ప్రాక్టీస్ లేకుండా ఎప్పుడూ మ్యాచ్‌లు ఆడుతూనే ఉంటే అది ఎంతవరకు కరెక్ట్. జట్టులోని ప్రతి ప్లేయర్‌తో కూడా మనకు ర్యాపో ఉండాలి. అత్యున్నత స్థాయి క్రికెట్‌ను అందించడానికి ఆటగాళ్లు ఒకరితో ఒకరు సంభాషించుకోవడం, కో ఆర్డినేట్ చేసుకోవడానికి తగినంత టైం కూడా కావాలి' అని బట్లర్ చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications