Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్రీజులో పాతుకుపోయిన ఫిలాండర్‌.. అశ్లీల పదజాలం ప్రయోగించిన బట్లర్‌ (వీడియో)!!

Jos Buttler caught calling Vernon Philander a f***ing k***head in fiery verbal tirade

కేప్‌టౌన్‌: బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించిన ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ (3/35) బౌలింగ్‌లోనూ సత్తాచాటడంతో.. దక్షిణాఫ్రికాపై రెండో టెస్టులో ఇంగ్లండ్‌ ఘన విజయం సాధించింది. ఓ దశలో మ్యాచ్‌ డ్రాగా ముగుస్తుందనుకున్న సమయంలో స్టోక్స్‌ మూడు వికెట్లు తీసి జట్టుకు అనూహ్య విజయాన్ని అందించాడు. మంగళవారం దక్షిణాఫ్రికాతో ముగిసిన రెండో టెస్టులో ఇంగ్లండ్‌ 189 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 4 టెస్టుల సిరీస్‌ను ఇంగ్లండ్‌ 1-1తో సమం చేసింది.

ఇంగ్లాండ్‌ విజయానికి 3 వికెట్లు

ఇంగ్లాండ్‌ విజయానికి 3 వికెట్లు

ఈ టెస్టు చివరి రోజు ఇంగ్లాండ్‌ వికెట్‌ కీపర్‌ జోస్‌ బట్లర్‌ వ్యక్తిగత దూషణకు దిగాడు. దక్షిణాఫ్రికా సీనియర్‌ ఆల్‌రౌండర్‌ వెర్నాన్ ఫిలాండర్‌పై అశ్లీల పదజాలం ప్రయోగించాడు. 438 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు మంగళవారం 126/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో చివరి రోజు ఆటకొనసాగించిన దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది. మరో 19 ఓవర్లు ఆడితే దక్షిణాఫ్రికా ఓటమి నుండి గట్టెక్కుతుంది. మరోవైపు ఇంగ్లాండ్‌ విజయానికి 3 వికెట్లు అవసరం.

 అశ్లీల పదజాలం

అశ్లీల పదజాలం

తన జట్టును ఆదుకునేందుకు ఫిలాండర్‌ ప్రయత్నం చేస్తున్నాడు. అప్పటికే 51 బంతులు ఆడి 8 పరుగులు చేశాడు. ఫిలాండర్‌ క్రీజులో పాతుకుపోవడంతో ఇంగ్లాండ్‌ ఆటగాళ్లలో అసహనం పెరిగింది. సరిగ్గా ఇదే సమయంలో ఇంగ్లీష్ బౌలర్‌ వేసిన ఓ బంతిని ఫిలాండర్‌ బ్యాటుతో డిఫెండ్‌ చేశాడు. బంతిని అందుకున్న జో రూట్‌.. కీపర్‌వైపు విసిరాడు. వికెట్ల వద్ద నిలబడ్డ ఫిలాండర్‌.. బంతిని గమనించలేదు. ఇదే అదునుగా భావించిన బట్లర్‌.. అశ్లీల పదజాలం వాడాడు. రాయలేనివి సైతం అన్నాడు. మరోవైపు బెన్‌ స్టోక్స్‌ కూడా ఎదో అన్నాడు.

బట్లర్‌పై మండిపడుతున్న అభిమానులు

బట్లర్‌పై మండిపడుతున్న అభిమానులు

బట్లర్‌, స్టోక్స్‌లు బూతులు మాట్లాడినా కూడా ఫిలాండర్‌ మాత్రం ఏమీ అనలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియో చూసిన అభిమానులు, క్రికెటర్లు బట్లర్‌పై మండిపడుతున్నారు. వ్యాఖ్యాతలు అప్పుడే ఇంగ్లాండ్‌ క్రికెటర్లను విమర్శించారు. 'వీడియోలో చాలా స్పష్టంగా, పెద్దగా వినిపిస్తోంది' అని పేసర్‌ డేల్‌ స్టెయిన్‌ ట్వీట్‌ చేశాడు. భారత వ్యాఖ్యాత హర్ష భోగ్లే 'దయనీయం' అంటూ ట్వీట్ చేసాడు.

సిరీస్‌ సమం

చివరి రోజు డికాక్‌ (50; 7 ఫోర్లు), ఫిలాండర్‌ మినహా ఇంకెవరూ ప్రతిఘటించలేకపోయారు. ఈ విజయంతో నాలుగు టెస్టుల సిరీస్‌ను 1-1తో ఇంగ్లండ్‌ సమం చేసింది. ఇంగ్లండ్‌ 269, 391/8 (డిక్లేర్డ్‌) చేయగా.. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 223 పరుగులు చేసింది. 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' స్టోక్స్‌కు దక్కింది. ఈ నెల 16 నుంచి పోర్ట్‌ ఎలిజబెత్‌లో మూడో టెస్టు జరుగుతుంది.

Story first published: Wednesday, January 8, 2020, 16:32 [IST]
Other articles published on Jan 8, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+