Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు చెప్పిన స్టార్ విదేశీ క్రికెటర్లు.. ఇండియా అభిమానుల వల్లే ఇలా ఉన్నామంటూ...!

Jos Buttler and Some Other Star Foreign Cricketers Wishes Independce Day of India

భారతదేశం తన 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని నేడు జరుపుకున్న సంగతి తెలిసిందే. దేశంలోని అన్ని ప్రాంతాలలో తెల్లవారుజామున జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు జోరుగా సాగాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి.. ప్రసంగించారు. ఇకపోతే భారతదేశానికి చెందిన పలువురు స్టార్ క్రికెటర్లు అలాగే క్రికెట్ సోదరులు సైతం 75వ స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తమ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఇకపోతే భారత క్రికెటర్లే కాకుండా.. విదేశీ క్రికెటర్లు సైతం ఇండియాకు శుభాకాంక్షలు తెలిపారు. ఇండియాకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో కేన్ విలియమ్సన్, జోస్ బట్లర్, ఏబీ డివిలియర్స్ మొదలైనవారు ఉన్నారు.

భారత అభిమానులు గొప్పవారు : జోస్ బట్లర్

ప్రస్తుతం ఇంగ్లాండ్ వైట్-బాల్ కెప్టెన్ జోస్ బట్లర్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో స్వాతంత్ర్య దినోత్సవానికి సంబంధించి ఇలా పేర్కొన్నాడు. ఇండియాకు 75వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. క్రికెట్‌ను ఆరాధించడంలోనూ, క్రికెటర్లను అభిమానించడంలోనూ భారత అభిమానులు ఎప్పటికీ గొప్పవారు అంటూ కితాబిచ్చాడు. ఇక బట్లర్ తనతో పాటు మిగతా స్టార్ ప్లేయర్లు ఇండిపెండెన్స్ విషెస్ చెప్పిన వీడియోను పోస్ట్ చేశాడు.

75 నాటౌట్

75 నాటౌట్

అదే సమయంలో దక్షిణాఫ్రికా పేస్ స్టార్ కగిసో రబాడ, వెటరన్ బ్యాటర్ ఫాఫ్ డుప్లెసిస్ మాజీ స్టార్ ఏబీ డివిలయర్స్ జానీ బెయిర్‌స్టో కూడా ఇండిపెండెన్స్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వీడియోను జాస్ బట్లర్ ట్విట్టర్లో షేర్ చేశాడు. 'నమస్తే ఇండియా. 75 నాటౌట్. చాలా బలమైన దేశం. భాతర ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. నేను ఎప్పుడూ ఇండియాలో ఆడిన నా టైంను పూర్తిగా ఆస్వాదిస్తాను.' అని జోస్ బట్లర్ వీడియోలో పేర్కొన్నాడు.

మీ ఆదరణ ఉండబట్టే మేమిలా ఉన్నాం

మీ ఆదరణ ఉండబట్టే మేమిలా ఉన్నాం

'నేను నా దక్షిణాఫ్రికా వెలుపల ఇంతటి ప్రేమను అందుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు, కానీ భారతదేశంలో ఆడిన ప్రతిసారీ నాకు లభించే ప్రేమ మద్దతు నన్ను అనిర్వచనీయమైన సంతోషానికి గురిచేస్తుంటుంది. భారత క్రికెట్ అభిమానులందరికీ 75వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. మీ ఆదరణ ఉండబట్టే మేము ఇలా ఉన్నాం' అని రబాడ చెప్పాడు. ఇక డివిలియర్స్, డుప్లెసిస్, జానీ బెయిర్ స్టో, కేన్ మామ సైతం తమదైన స్టైల్లో భారత్‌కు ఇండిపెండెన్స్ విషెస్ చెప్పారు. ఇకపోతే స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చాలా మంది భారతీయులు తమ సోషల్ మీడియాలో తమ ప్రొఫైల్ చిత్రాలను జెండా చిత్రంగా మార్చుకున్నారు. ప్రభుత్వం చేపట్టిన "హర్ ఘర్ తిరంగా" కార్యక్రమానికి మద్దతు ఇవ్వడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పౌరులందరూ తమ ఇళ్ల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని కోరగా.. దీనికి అనూహ్య స్పందన వచ్చింది.

Story first published: Monday, August 15, 2022, 20:32 [IST]
Other articles published on Aug 15, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+