వరల్డ్‌కప్: ఇంగ్లాండ్ తరుపున జోస్ బట్లర్ అరుదైన రికార్డు

హైదరాబాద్: నాటింగ్‌హామ్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఆటగాడు జోస్ బట్లర్ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో జోస్ బట్లర్ 75 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. తద్వారా వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్ తరుపున అత్యంత వేగంగా సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 348 పరుగులు చేసింది. అనంతరం చేధనలో ఇంగ్లాండ్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. షాదాబ్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో ఓపెనర్ జాసన్ రాయ్ (8)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.
ఆ తర్వాత జానీ బెయిర్‌స్టో (32), జో రూట్ నిలకడగా ఆడటంతో ఇంగ్లాండ్ 8.5 ఓవర్లకు వికెట్ నష్టానికి 60 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. ఆ తర్వాత పాక్ బౌలర్లు విజృంభించి మూడు వికెట్లు పడగొట్టారు. బెయిర్‌స్టోను వాహబ్ రియాజ్, మోర్గాన్ (9)ను హఫీజ్, స్టోక్స్ (13)ను మాలిక్ ఔట్ చేశాడు.
దీంతో 118/4తో కష్టాల్లో ఉన్న దశలో క్రీజులోకి వచ్చిన జోస్ బట్లర్ మరో ఆటగాడు జో రూట్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ సెంచరీలు సాధించి ఇంగ్లాండ్‌ను పోటీలోకి తెచ్చారు. ఈ క్రమంలో 104 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 107 పరుగులు చేసి షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.
అయితే, చివర్లో పాక్ బౌలర్లు మరోసారి విజృంభించడంతో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడిని పెంచడంలో విజయవంతమయ్యారు. దీంతో ఈ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్ 14 పరుగుల తేడాతో ఓడిపోయింది. పాకిస్థాన్ బౌలర్లలో వాహబ్ రియాజ్ మూడు వికెట్లు తీయగా.. షాదాబ్, ఆమిర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications