ప్రపంచ క్రికెట్‌లో నయా ధోని ఎవరో తెలుసా?

హైదరాబాద్: శ్రీలంక చేతిలో ఓడినప్పటికీ.... ఇంగ్లాండ్ ఇప్పటికీ ప్రపంచకప్ టైటిల్ ఫేవరేట్ జట్టేనని ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్ తెలిపాడు. టోర్నీలో భాగంగా మంగళవారం ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ జట్ల తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కి ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమిస్తోంది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

జస్టిన్ లాంగర్ మాట్లాడుతూ
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్ మీడియా మాట్లాడుతూ జోస్ బట్లర్ బ్యాటింగ్, ప్రత్యర్థి జట్లపై ఒత్తిడి తీసుకురావడం టీమిండియా వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీలా ఉంటుందని చెప్పుకొచ్చాడు. మంగళవారం జరిగే మ్యాచ్‌లో బట్లర్‌ను డకౌట్‌గా పంపాలనుకుంటున్నట్లు తెలిపాడు.

ప్రస్తుతం ఆ మ్యాచ్ గురించే ఆలోచిస్తున్నాం
"ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌ని ఇంగ్లాండ్ జట్టు కలిగి ఉంది. ఆ జట్టుని ఒక్కసారి పరిశీలిస్తే గత వారంగా ఎలాంటి మార్పుల్లేవు. ప్రపంచకప్‌లో లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరగనున్న మ్యాచ్ కోసం మంగళవారం వరకు ఆగలేకపోతున్నాను. ప్రస్తుతం ఆ మ్యాచ్ గురించే ఆలోచిస్తున్నాం" అని జస్టిన్ లాంగర్ తెలిపాడు.

జోస్ బట్లర్ అద్భుతమైన ఆటగాడు
"జోస్ బట్లర్ అద్భుతమైన ఆటగాడు. అతని బ్యాటింగ్ చూడటం నాకు చాలా ఇష్టం. వరల్డ్ క్రికెట్‌లో అతను నయా ధోనీ. మంగళవారం జరగనున్న మ్యాచ్‌లో బట్లర్‌ను డకౌట్‌గా పెవిలియన్‌కు పంపాలని ఆశపడుతున్నా. ప్రస్తుత క్రికెట్‌లో చాలా ప్రమదకరంగా మారాడు. మంచి ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నాడు" అని లాంగర్ తెలిపాడు.

భారత్ చేతిలో ఓడిన ఆసీస్
ఈ ప్రపంచకప్‌లో భాగంగా ఆడిన ఐదు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా నాలుగింటిలో విజయం సాధించింది. ఈ టోర్నీలో కోహ్లీసేనతో ఆడిన మ్యాచ్‌లోనే ఆస్ట్రేలియా ఓడిపోయింది. దీంతో 10 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ఇంగ్లాండ్ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో రెండు మ్యాచ్‌ల్లో ఓడి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications