Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Viral Video: సూపర్ మ్యాన్‌గా మారిన జాంటీ రోడ్స్.. 55 ఏళ్ల వయస్సులో గాల్లోకి ఎగిరి..

Viral Video: ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ 11వ మ్యాచ్ ఆస్ట్రేలియా మాస్టర్స్, దక్షిణాఫ్రికా మాస్టర్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికాను 137 పరుగుల తేడాతో ఓడించింది. కెప్టెన్ షేన్ వాట్సన్ ఈ టోర్నమెంట్ లో తన మూడో సెంచరీని సాధించాడు. 61 బంతుల్లో 122 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా లెజెండ్ జాంటీ రోడ్స్ తన ఫీల్డింగ్ తో ఆకట్టుకున్నాడు. జాంటీ రోడ్స్ ఫీల్డింగ్ ప్రతిభ గురించి క్రికెట్ ఫ్యాన్స్ కు తెలిసిందే. ఆటగాళ్లు ఫీల్డింగ్ కు మాత్రమే పరిమితమైతే.. జాంటీ రోడ్స్ మైదానంలో విన్యాసాలు చేయగలడు. పులి జింకను వేటాడుతున్నట్లు రోడ్స్ కదలికలు ఉంటాయి. అంత వేగంగా స్పందిస్తాడు. ప్రపంచంలోనే గొప్ప ఫీల్డర్ గా జాంటీ రోడ్స్ పేరు సంపాదించుకున్నాడు. రోడ్స్ గాల్లో ఎగురుతూ బంతిని పట్టుకోవడంలో ప్రసిద్ధి చెందాడు. తాజాగా జాంటీ రోడ్స్ ఇంటర్నేషనల్ మాస్టర్ లీగ్ లో కూడా తన అద్భుతమైన ఫీల్డింగ్ ను ప్రదర్శించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

55 ఏళ్ల వయస్సులో జాంటీ రోడ్స్ విన్యాసాలు
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ మ్యాచ్ లో జాంటీ రోడ్స్ అద్భుతమైన ఫీల్డింగ్ వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఆ వీడియోలో షేన్ వాట్సన్ ఫ్రంట్-ఫుట్ షాట్ ఆడాడు. బంతి బౌండరీ వైపుకు వెళ్తోంది. కానీ అకస్మాత్తుగా జాంటీ రోడ్స్ పరిగెత్తుకుంటూ వచ్చి బంతిని బౌండరీ దాటకుండా ఆపకుండా గాల్లోకి డైవ్ చేశాడు. 55 ఏళ్ల వయస్సుతో జాంటీ రోడ్స్ తన అద్భుతమైన ఫిట్‌నెస్ తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. తాను ఇంకా ఇంత ఫిట్ గా ఉన్నాడో చూపించాడు. జాంటీ రోడ్స్ తన కాలంలో అత్యుత్తమ ఫీల్డర్ గా పరిగణించబడ్డాడు.

Jonty Rhodes Turns into Superman Leaps in the Air at 55 to Make Stunning Fielding Effort Video Goes Viral
Photo Credit: twitter

మ్యాచ్ పరిస్థితి ఇలా..
ఆస్ట్రేలియా మాస్టర్స్ తో జరిగిన మ్యాచ్ లో దక్షిణాప్రికా కెప్టెన్ జాక్వెస్ కల్లిస్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 260 పరుగులు చేసింది. వాట్సన్ అజేయంగా 122 పరుగులు చేయగా, ఫెర్గూసన్ 85 పరుగులు చేశాడు. అదే సమయంలో బెన్ డంక్ 34 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. 261 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా మాస్టర్స్ 17 ఓవర్లలో 123 పరుగులకు ఆలౌటైంది. దక్షిణాఫ్రికా తరపున హషీమా ఆమ్లా అత్యధికంగా 30 పరుగులు చేశాడు. ఆ విధంగా దక్షిణాఫ్రికా మాస్టర్స్ మ్యాచ్ ను 137 పరుగుల తేడాతో ఓడిపోయింది.
Story first published: Saturday, March 8, 2025, 8:17 [IST]
Other articles published on Mar 8, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+