
డివిలియర్స్‌కు పెద్ద అభిమానిని:
తాజాగా జాంటీ రోడ్స్ ఓ స్పోర్ట్స్ ఛానెల్‌లో మాట్లాడుతూ... 'నేను ఏబీ డివిలియర్స్‌కు పెద్ద అభిమానిని. ముందు ఏం జరిగిందో నాకైతే పూర్తిగా తెలియదు. దక్షిణాఫ్రికా టీ20 ప్రపంచకప్ గెలవాలంటే ఏదైనా చేయాలి. ఐపీఎల్‌లో ఏబీ ఎలా ఆడతాడోనని చాలామంది ఎదురుచూస్తున్నారు. బిగ్‌బాష్‌లో తన క్లాస్ చూపించాడు' అని అన్నారు. ఈ ఏడాది అక్టోబర్ నెలలో ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ జరగనున్న విషయం తెలిసిందే.

ఏబీ ప్రత్యేకమైన ఆటగాడు:
'ఇది కఠిన నిర్ణయం కాబట్టి చాలా ఆసక్తికరంగా అనిపిస్తోంది. ప్రపంచకప్‌లో అత్యుత్తమ జట్టు ఆడాలి. ఏబీ చాలా ప్రత్యేకమైన ఆటగాడు. ప్రస్తుతం అతడు దక్షిణాఫ్రికాకు ఆడటం లేదు కాబట్టి ఏదైనా బెంచ్‌మార్క్ నిర్దేశించారా?. ఏబీని ఎందుకు ఎంపిక చేస్తున్నారో స్పష్టత ఉంటే చాలు. ఇక్కడ నిబంధనల ఉల్లంఘనేమీ లేదు. కొంచెం ముందు చూపు ఉండాలి' అని జాంటీ రోడ్స్ పేర్కొన్నారు. డివిలియర్స్‌ను టీ20 ప్రపంచకప్‌లో ఆడించాలని, ఎందుకు ఎంపిక చేస్తున్నామో అందరి తెలుసు అని పరోక్షంగా అన్నారు.

ఏబీ కోసం ఏమైనా చేయొచ్చు:
'ఏబీ డివిలియర్స్‌ను ఎంపిక చేయడం వల్ల మరికొందరి అవకాశాలు సన్నగిలుతాయి. ప్రస్తుతం పోటీలో ఉన్న ఆటగాళ్లను కాదని ఒక్కసారిగా డివిలియర్స్‌ను ఎంపిక చేస్తే ఇది దక్షిణాఫ్రికా క్రికెట్‌లో చెడు సాంప్రదాయానికి దారి తీసినట్లు విమర్శలు వస్తాయి. కానీ.. నేను డివిలియర్స్ ఉన్న జట్టునే ఇష్టపడతా. మా కోసం అతడు ప్రపంచకప్ ఆడితే చూడాలనుంది' అని జాంటీ చెప్పుకొచ్చారు. డివిలియర్స్ స్థాయి ఆటగాడి కోసం ఏం చేసినా తప్పేమీ లేదన్నారు.

2018లో క్రికెట్‌కు వీడ్కోలు:
ఏబీ డివిలియర్స్ 2018 మేలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం ఐపీఎల్ తరహా లీగుల్లో మాత్రమే ఆడుతున్నాడు. గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌కు అవసరమైతే అందుబాటులో ఉంటానని ఏబీ డివిలియర్స్ చెప్పగా.. సెలక్టర్లు అందుకు అంగీకరించలేదు. అప్పటి కెప్టెన్ ఫఫ్ డుప్లెసిస్ కూడా ఏబీ పునరాగమనం కోసం బాగానే ప్రయతించాడు. అయితే అప్పటికే సెలక్టర్లు జట్టుపై ఓ అంచనాకి రావడంతో ఏమీ చేయలేకపోయాడు.


Click it and Unblock the Notifications
