మోడ్రన్ ఎరాలో బెస్ట్ ఫీల్డర్ అతడే!: జాంటీ రోడ్స్ కితాబు


హైదరాబాద్: క్రికెట్లో అత్యుత్తమ ఫీల్డర్ ఎవరంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు దక్షిణాఫ్రికా మాజీ ప్లేయర్ జాంటీ రోడ్స్. పక్షిలా రివ్వున ఎగురుతూ మైదానంలో అద్భుత విన్యాసాలు చేసే దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు రోడ్స్‌ను అభిమానులు ముద్దుగా సూపర్‌మ్యాన్ అని పిలుచుకుంటారు. క్రికెట్‌లో సరికొత్త ఫీల్డింగ్ ప్రమాణాలు నెలకొల్పాడు. మరి అలాంటి ఆటగాడికి మోడ్రన్ ఎరాలో నచ్చిన బెస్ట్ ఫీల్డర్ ఎవరో తెలుసా? భారత క్రికెటర్ సురేశ్ రైనా.

రైనాకు అగ్రస్థానాన్ని కట్టబెట్టిన జాంటీ రోడ్స్
ఈ విషయాన్ని జాంటీ రోడ్స్ స్వయంగా వెల్లడించాడు. ఆధునిక క్రికెట్లో ఐదుగురు ఉత్తమ ఫీల్డర్ల గురించి చెప్పమని ఐసీసీ అతడిని కోరగా.. రోడ్స్ రైనాకు అగ్రస్థానాన్ని కట్టబెట్టాడు. మైదానంలో సురేష్ ఎంతో సానుకూల దృక్పథంతో కనిపిస్తాడని ప్రశంసించాడు. జాంటీ రోడ్స్ జాబితాలో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ నుంచి ఒక్కొక్కరికి.. దక్షిణాఫ్రికా నుంచి ఇద్దరికి చోటు లభించింది.

రైనా ఫీల్డింగ్ చూడముచ్చటగా ఉంటుంది
రైనా టాప్‌లో నిలవగా.. ఏబీ డివిల్లీర్స్, పాల్ కాలింగ్‌వుడ్, హెర్షల్ గిబ్స్, ఆండ్రూ సైమండ్స్‌కు తర్వాతి స్థానాలు దక్కాయి. "రైనా ఫీల్డింగ్ చూడముచ్చటగా ఉంటుంది. అతడే నా నంబర్ వన్ ఫీల్డర్. అతడికి నేను పెద్ద అభిమానిని" అని అన్నాడు.
భారత మైదానాల్లో ఫీల్డింగ్ చేయడం అంత సులభం కాదు
"భారత మైదానాల్లో ఫీల్డింగ్ చేయడం అంత సులభం కాదు. రైనా ఎంతో ఏకాగ్రతతో ప్రాక్టీస్ చేస్తాడు. డైవ్ చేసే సమయంలో రెండో ఆలోచనే అతడికి రాదు. ఎప్పుడూ బంతిని అందుకోవాలనే తాపత్రయం అతడిలో కనిపిస్తుంది. నా నైజం కూడా అదే" అని జాంటీ రోడ్స్ వివరించాడు. స్లిప్పులు, అవుట్ ఫీల్డ్స్, సర్కిల్‌లో రైనా ఎన్నో గ్రేట్ క్యాచ్‌లు అందుకున్నాడని తెలిపారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications