Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హేడెన్ నుదురుపై గాయం: అచ్చం తమిళనాడు మ్యాప్‌లా ఉందన్న జాంటీ రోడ్స్

Jonty Rhodes Finds The Map Of Tamil Nadu On Matthew Haydens Head Injury

హైదరాబాద్: భారత్‌పై తనకున్న ప్రేమను దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ మరోసారి చాటుకున్నాడు. గతంలో తన కుమార్తెకు ఇండియా అని పేరు పెట్టిన జాంటీ రోడ్స్... తాజాగా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ మాథ్యూ హేడెన్‌ తలకు తగిలిన గాయంలో తమిళనాడు మ్యాప్‌ని కనుగొన్నాడు.

అసలేం జరిగింది?

అసలేం జరిగింది?

ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్‌ మాథ్యూ హేడెన్‌ త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. గత శుక్రవారం క్వీన్స్‌ల్యాండ్‌లోని నార్త్ స్ట్రాడ్‌బ్రోక్‌లో తన కొడుకు జోష్‌తో కలిసి సర్ఫింగ్ చేస్తుండగా హేడెన్ తీవ్రంగా గాయపడ్డాడు. పెద్ద అల వచ్చి కొట్టడంతో అతను సమీపంలో ఉన్న వాహనాన్ని ఢీకొట్టాడు.

మెడ, నుదురుపై తీవ్ర గాయాలు

మెడ, నుదురుపై తీవ్ర గాయాలు

దీంతో హేడెన్‌ వెన్నెముక ఎముకలు విరిగిపోవడంతో పాటు మెడ, నుదురుపై తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ ఫొటోను హేడెన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నాడు. అయితే, ఈ ఫోటోని చూసిన జాంటీ రోడ్స్ తనదైన శైలిలో స్పందించాడు.

 నీ నుదిటిపై తమిళనాడు మ్యాప్ వేసుకున్నావా?

నీ నుదిటిపై తమిళనాడు మ్యాప్ వేసుకున్నావా?

"హెడెన్... నీ నుదిటిపై తమిళనాడు మ్యాప్ వేసుకున్నావా? బుడ్డీ నిజమైన నిబద్ధత కలిగి ఉన్నావ్!!! నిన్ను అనుసరించి కొంతమంది అదే విధంగా టాటూలు వేసుకునే అవకాశం ఉంది!!" అని ఫోటోకు కామెంట్ చేశాడు. అయితే, జరిగిన ఘటనను బ్రిస్బేన్‌కు చెందిన కొరియర్ మెయిల్ వార్తసంస్థకు ఈ ఆసీస్ మాజీ క్రికెటర్ సోమవారం వివరించాడు.

కొడుకుతో కలిసి సర్ఫింగ్ చేస్తున్న క్రమంలో

"పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాను. కొడుకుతో కలిసి సర్ఫింగ్ చేస్తున్న క్రమంలో నా కుడివైపు నుంచి అలలు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. దీంతో ఆ వేగానికి నా మెడలు ఒక్కసారిగా తిరిగిపోయాయి. ఆ తర్వాత నా తల ఇసుకదిబ్బకు బలంగా గుద్దుకుంది. అక్కడి వరకే గుర్తుకు వుంది, ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలేదు. మెడకు దగ్గరలోని వెన్నెముకకు సంబంధించిన c6 ఎముక విరిగిపోగా, c5, c4 ఎముకలు చిట్లిపోయాయి" అని హేడెన్ వివరించాడు.

Story first published: Tuesday, October 9, 2018, 13:04 [IST]
Other articles published on Oct 9, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+