For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్‌: 23న స్వదేశానికి జానీ బెయిర్‌స్టో

Jonny Bairstow to leave IPL 2019 for England World Cup camp after April 23

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ డాషింగ్ ఓపెనర్‌ జానీ బెయిర్‌స్టో ఈ నెల 23న స్వదేశానికి బయదేరనున్నాడు. దీంతో ఈ ఓపెనర్ మరో రెండు మ్యాచ్‌లకే సన్‌రైజర్స్‌ జట్టుకు అందుబాటులో ఉండనున్నాడు. ఐర్లాండ్, పాకిస్థాన్ జట్లతో సిరీసులు.. మే 30 నుండి ప్రపంచకప్‌ ఉన్న నేపథ్యంలో ఇంగ్లండ్‌ జట్టు శిక్షణ శిబిరం ప్రారంభం కానుండడంతో బెయిర్‌ స్టో స్వదేశానికి బయలుదేరనున్నాడు.

ఆదివారం కోల్‌కతాతో, మంగళవారం చెన్నైతో జరిగే మ్యాచ్‌లకు మాత్రమే బెయిర్‌ స్టో సన్‌రైజర్స్‌కు ఆడతాడు. ఈ సీజన్-12లో సన్‌రైజర్స్‌ జట్టు ఆడిన 8 మ్యాచ్‌లలో 4 విజయాలు సాధించి ప్లే ఆఫ్ రేసులో ఉంది. సన్‌రైజర్స్‌కు ఓపెనర్లే పెద్ద బలం. ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్‌లలో ఓపెనర్లు డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టోలే పరుగులు చేశారు. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లలో జానీ బెయిర్‌స్టో లేకపోవడం ఆ జట్టుకు పెద్ద లోటే.

ఇప్పటికే రాజస్థాన్‌ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ జట్టుకు దూరం అయ్యాడు. బట్లర్‌ భార్య లౌసీ పురిటి నొప్పులతో ఆసుపత్రిలో చేరడంతో.. బట్లర్‌ తనకు పుట్టబోయే బిడ్డను చూసుకునేందుకు ఇంగ్లాండ్‌కు పయనమయ్యాడు. ఇక రాజస్థాన్‌ మరో ప్రధాన ఆటగాళ్లు బెన్‌ స్టోక్స్‌, జోఫ్రా అర్చర్‌ ఏప్రిల్‌ 23న జట్టును వీడనున్నారు. డిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌ తర్వాత వీరిద్దరూ స్వదేశంకు వెళ్లిపోనున్నారు. ఐర్లాండ్, పాకిస్థాన్ సిరీస్ లు ఉన్న కారణంగా స్వదేశానికి పయనం కానున్నారు.

Story first published: Sunday, April 21, 2019, 16:15 [IST]
Other articles published on Apr 21, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+