మెరుపు శతకం.. ఐపీఎల్ ఫామ్ కొనసాగించిన బెయిర్‌స్టో

ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ జానీ బెయిర్‌స్టో (128; 93 బంతుల్లో 15 ఫోర్లు, 5 సిక్సర్లు) ఐపీఎల్-12 ఫామ్‌ను కొనసాగిస్తూ మెరుపు శతకం సాధించాడు. దీంతో 359 పరుగుల భారీ లక్ష చేధనను ఇంగ్లాండ్ 31 బంతులు ఉండగానే ఛేదించింది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన మూడో వన్డేలో పాకిస్తాన్‌పై 6 వికెట్ల తేడాతో గెలిచి 2-0తో ఇంగ్లాండ్ ముందంజలో ఉంది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

ఇమామ్ ఉల్ హక్ శతకం:
మొదటగా బ్యాటింగ్ చేసిన పాక్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ ఫఖర్ జామన్ (2) త్వరగానే పెవిలియన్ చేరాడు. అనంతరం వచ్చిన బాబర్ ఆజాం (15) కూడా విఫలమయ్యాడు. ఈ దశలో మరో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్.. సోహైల్ (41), కెప్టెన్ అహ్మద్ (27), అసిఫ్ అలీ (52)లతో కలిసి విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఈ క్రమంలోనే హక్ (151; 131 బంతుల్లో 16 ఫోర్లు, 1సిక్సర్) శతకం చేసాడు. చివరలో వసీం (22), ఆసన్ అలీ (18)లు బ్యాట్ జులిపించడంతో పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. సామ్ కరన్ రెండు వికెట్లు తీసాడు.
బెయిర్ స్టో మెరుపులు:
అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు మంచి ఆరంభం ఇచ్చారు. ముఖ్యంగా బెయిర్ స్టో ఐపీఎల్ ఫామ్ కొనసాగిస్తూ.. బౌండరీల మోత మోగించాడు. మరోవైపు జాసన్ రాయ్ (76) కూడా ధాటిగానే ఆడాడు. ఈ ఇద్దరు తొలి వికెట్ కు 159 పరుగులు జోడించారు. అనంతరం రూట్ (43), మొయిన్ అలీ (46 నాటౌట్)లు పరుగులు చేశారు. రూట్ అవుట్ అయినా.. కెప్టెన్ మోర్గాన్ (17) సహాయంతో అలీ ఇంగ్లండ్‌ను విజయతీరాలకు చేర్చాడు. పాక్ బౌలర్లలో వసీం, జునైద్ ఖాన్, అష్రాఫ్ తలో వికెట్ తీశారు. బెయిర్ స్టోకు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కింది.

10 మ్యాచ్‌లాడి 445 పరుగులు:
తన ఐపీఎల్ అరంగేట్ర సీజన్‌లోనే జానీ బెయిర్ స్టో చెలరేగాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తరుపున కేవలం 10 మ్యాచ్‌లాడి 445 పరుగులతో జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ప్రపంచకప్‌కు దగ్గర పడుతున్న సమయంలో స్వదేశానికి వెళ్లడంతో బెయిర్ స్టో ఐపీఎల్ కీలక మ్యాచులకు దూరమయ్యాడు. ప్రస్తుతం పాక్ సిరీస్‌లో కూడా పరుగుల వరద పారిస్తుండడం ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ జట్టుకు కలిసొచ్చే అంశం.

నా ఆట ఎంతో మెరుగైంది:
ఐపీఎల్‌లో డేవిడ్ వార్నర్ లాంటి వాళ్లతో కలిసి ఆడటంతో నా ఆట ఎంతో మెరుగైంది. వేర్వేరు కోచ్‌లు, వివిధ దేశాల ఆటగాళ్ల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. వార్నర్ ఒత్తిడిని ఎదుర్కొని ఎలా ఆడాలో దగ్గరుండి తెలుసుకున్నా. ధైర్యంగా ఎలా ఆడాలో కూడా వార్నర్‌ను చూసి నేర్చుకున్నా' అని చెప్పుకొచ్చారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications