బెయిర్ స్టో సెంచరీ vs West Indies: సన్‌రైజర్స్ ఫ్యాన్స్‌లో అసంతృప్తి .. కావ్య పాపపై మళ్లీ గుస్సా!

ఆంటిగ్వా: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో అజేయ సెంచరీతో చెలరేగాడు. సెంచరీతో చెలరేగడమే కాకుండా 115 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను ఆదుకున్నాడు. బెయిర్స్ స్టో ఆపద్భాంధవ ఇన్నింగ్స్‌తో తొలి రోజు ఆట ముగిసే సమయానికి పర్యాటక జట్టు ఇంగ్లండ్ పటిష్ట స్థితిలో నిలిచింది. అయితే బెయిర్‌స్టో సెంచరీతో చెలరేగడం చూసి సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు మాత్రం తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ఈ క్రమంలో సన్‌రైజర్స్ ఓనర్ కావ్య మారన్‌పై గుస్సా అవుతున్నారు.

జానీ బెయిర్‌స్టో అజేయ సెంచరీ
మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్‌ను వెస్టిండీస్ బౌలర్లు వణికించారు. వరుసపెట్టి వికెట్లు తీస్తూ ఆంగ్లేయులను కష్టాల్లోకి నెట్టారు. దీనికి తోడు ఇంగ్లండ్ టాపార్డర్ పూర్తిగా విఫలమవడంతో ఆ జట్టు 48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు వచ్చిన బెయిర్‌స్టో.. బెన్ స్టోక్స్‌తో కలిసి జట్టును ఆదుకున్నాడు. ఐదో వికెట్‌కు 67 పరుగులు జోడించాక 36 పరుగులు చేసిన స్టోక్స్ ఔటయ్యాడు. అనంతరం వికెట్ కీపర్ బెన్ వోక్స్ (42), క్రిస్ వోక్స్ (24*) తో కలిసి బెయిర్ స్టో ఇంగ్లండ్‌ను పటిష్ట స్థితిలో నిలిపాడు. ఈ క్రమంలో టెస్ట్ కెరీర్లో ఎనిమిదో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 216 బంతులు ఎదుర్కొన్న బెయిర్ స్టో 17 ఫోర్లతో 109 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో ఇంగ్లండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది.

కావ్య మారన్‌పై అసంతృప్తి
జానీ బెయిర్‌స్టో ఈ అద్భుత ఇన్నింగ్స్ చూసి సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు మాత్రం తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కావ్య టీం ఎంపిక విధానంపై మరోసారి విమర్శలు గుప్పిస్తున్నారు. ఎందుకంటే గత సీజన్లో సన్‌రైజర్స్‌కే ఆడిన బెయిర్ స్టోను వేలానికి ముందు రిటైన్ చేసుకోలేదు. అంతేకాకుండా మెగా వేలంలో కూడా కొనుగోలు చేయలేదు.

నిరాశలో సన్‌రైజర్స్ ఫ్యాన్స్
మెగా వేలంలో బెయిర్‌స్టోను పంజాబ్ కింగ్స్ జట్టు 6 కోట్ల 75 లక్షల రూపాయలకు దక్కించుకుంది. దీంతో ప్రస్తుతం సెంచరీతో సూపర్ ఫామ్‌లో ఉన్న బెయిర్‌స్టో ఈ సారి తమ జట్టులో లేడని సన్‌రైజర్స్ ఫ్యాన్స్ వాపోతున్నారు. బెయిర్ స్టో జట్టులో ఉంటే ఓపెనింగ్ బాగుండేదని భావిస్తున్నారు. గతంలో సన్‌రైజర్స్‌కు బెయిర్‌స్టో అనేక విజయాలు అందించిన సంగతి తెలిసిందే. మంచి ఓపెనింగ్ భాగస్వామ్యాలు కూడా అందించాడు.

బెయిర్‌స్టో రికార్డులు
ఐపీఎల్‌లో బెయిర్‌స్టోకు ఘనమైన రికార్డులు ఉన్నాయి. ఈ మెగా లీగ్‌లో బెయిర్ స్టో ఏకంగా 41 సగటుతో పరుగులు రాబట్టాడంటేనే అతని సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 28 మ్యాచ్‌లు ఆడిన జానీ బెయిర్‌స్టో 1038 పరుగులు చేశాడు. ఇందులో 7 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 114 పరుగులుగా ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications