
విశ్రాంతి తర్వాత రెచ్చిపోతా
తాజాగా జానీ బెయిర్‌స్టో 'స్టాండర్డ్.కో.యూకే'తో మాట్లాడుతూ... 'ఇప్పుడు ఇవ్వకపోతే ఇంకెప్పుడు వాళ్లు నాకు విశ్రాంతినిస్తారు. ప్రస్తుత ప్రపంచం ఇలాగే ఆలోచిస్తోంది. మూడు ఫార్మాట్లు ఆడుతున్న ఓ ఆటగాడు సిరీస్ సాంతం ఆడుతున్న సందర్భాలు తక్కువ. వేసవి, శీతాకాలంలో సుదీర్ఘంగా క్రికెట్ జరిగింది. అన్నింటా ఆడలేం కదా. బయో బుడగ నుంచి బయటకెళ్లి కుటుంబ సభ్యులను చూడాల్సిన అవసరం ఉంది. విశ్రాంతి తర్వాత నేను టీమిండియాపై రెచ్చిపోతాను' అని ధీమా వ్యక్తం చేశాడు.

భావోద్వేగానికి గురయ్యా
'ఇంగ్లాండ్ టెస్టు జట్టులోకి తిరిగి రావడం సంతోషం కలిగించింది. శ్రీలంకపై విజయం తర్వాత డ్రస్సింగ్ రూమ్‌లోకి ప్రవేశించాక భావోద్వేగానికి గురయ్యాను. భారీ స్కోర్లు చేస్తే బాగుండేది. కానీ చేసిన పరుగులతో సంతృప్తిగానే ఉన్నా' అని జానీ బెయిర్‌స్టో తెలిపాడు. ఎరుపు బంతి క్రికెట్ ఆడటం తనకిష్టమని పేర్కొన్నాడు. బయో బుడగల మధ్య ఆడటం కాస్త భిన్నంగా, కష్టంగా ఉందని జానీ వెల్లడించాడు. స్పిన్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కునే ఇంగ్లీష్ ఆటగాళ్లలో బెయిర్‌స్టో ఒకడు. తాజాగా శ్రీలంకతో ముగిసిన రెండు టెస్టుల్లో బాగా ఆడాడు.

బెయిర్‌స్టోకు మంచి రికార్డు
భారతదేశంలో కూడా జానీ బెయిర్‌స్టోకు మంచి రికార్డు ఉంది. ఇక్కడ ఆరు టెస్టుల్లో 40.11 సగటుతో 361 పరుగులు చేశాడు. ఉపఖండంలో అతని టెస్టు సగటు 40గా ఉంది. అంతేకాదు ఓ సెంచరీ కూడా చేశాడు. మొత్తంగా 72 టెస్టుల్లో 35.03 సగటుతో ఆరు సెంచరీలు మరియు 21 అర్ధ సెంచరీలతో 4169 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఆడుతున్న బెయిర్‌స్టోకి.. భారత్ పరిస్థితులపై చక్కటి అవగాహన ఉంది. క్రీజులో కుదురుకున్నాడంటే భారీ ఇన్నింగ్స్‌లు ఆడగల సామర్థ్యం అతడిది.


Click it and Unblock the Notifications

వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!










