ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి, నాకు రెస్ట్ కావాలి.. బతిమాలుకున్న జానీ బెయిర్ స్టో..!

ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో కీలక స్టేట్ మెంట్ ఇచ్చాడు. దక్షిణాఫ్రికాతో జరగనున్న టెస్టు సిరీస్‌కు ముందు తాను విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నానని స్పష్టం చేశాడు. అందువల్ల ఈ ఏడాది 'ది హండ్రెడ్' టోర్నీలో ఆడబోనని స్పష్టం చేశాడు. బెయిర్‌స్టో ఈ ఏడాది అప్రతిహత ఫామ్ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్లలో బెయిర్ స్టో ఒకడనే సంగతి తెలిసిందే. ఇటీవల టెస్ట్ ఫార్మాట్లో అతని వీరోచిత ఇన్నింగ్స్‌ల వల్ల అతనిపై ప్రశసంలు కురిశాయి. 32ఏళ్ల అతను ది హండ్రెడ్ టోర్నీ మునుపటి ఎడిషన్‌లో వెల్ష్ ఫైర్ మెన్స్ టీం తరఫున ఆడాడు. ఈ ఏడాది ఆగస్ట్ 3న ప్రారంభమై సెప్టెంబర్ 3వరకు ఈ టోర్నీ కొనసాగబోతుంది. ఇకపోతే ఈ ఏడాది ది హండ్రెడ్ టోర్నీలో తాను ఆడబోనని బెయిర్‌స్టో మంగళవారం తెలిపాడు.

చాలా డిస్సాపాయింట్ అవుతున్నా
ఈ మేరకు స్కై న్యూస్‌తో జానీ బెయిర్‌స్టో మాట్లాడాడు. ఈ సంవత్సరం ది హండ్రెడ్ టోర్నమెంట్‌లో భాగం కాలేకపోతున్నందుకు తాను నిరాశ చెందినట్లు పేర్కొన్నాడు. ఈ మేరకు హంబుల్ రిక్వెస్ట్ చేశాడు. కొన్ని నెలలపాటు తీరిక లేకుండా క్రికెట్ ఆడాల్సొచ్చిందని దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు ముందు తనకు కచ్చితంగా రెస్ట్ అవసరమని అతను పేర్కొన్నాడు. ఈ మేరకు తన టీం అయిన వెల్ష్ ఫైర్ మెన్స్ అండ్ వుమెన్స్ టీంలకు తన శుభాకాంక్షలను తెలిపాడు. ఇరు జట్లను చీర్స్ చేయడానికి తాను సదా ముందుంటానని చెప్పాడు. ఇకపోతే జానీని తాము అర్థం చేసుకున్నామని వెల్ష్ ఫైర్ జట్టు కూడా ప్రకటించింది. అతని రిక్వెస్ట్‌ను అంగీకరించింది.

మొత్తం ఎనిమిది టీంలు
ఇంగ్లాండ్‌లో జరిగే ప్రముఖ క్రికెట్ టోర్నమెంట్ ది హండ్రెడ్. మెన్స్ ఎడిషన్ ఆగస్టు 3న ప్రారంభం కానుంది. సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్‌లో సదరన్ బ్రేవ్ వర్సెస్ వెల్ష్ ఫైర్ మధ్య తొలి మ్యాచ్ జరుగుతుంది. ఈ టోర్నీలో ఎనిమిది జట్లు ఒకదానితో ఒకటి తలపడతాయి. ఈ ఎనిమిది టీంలు.. ట్రెంట్ రాకెట్స్, నార్తర్న్ సూపర్‌చార్జర్స్, బర్మింగ్‌హామ్ ఫీనిక్స్, సదరన్ బ్రేవ్, వెల్ష్ ఫైర్, ఓవల్ ఇన్విన్సిబుల్స్, మాంచెస్టర్ ఒరిజినల్ మరియు లండన్ స్పిరిట్.

హండ్రెడ్ లీగ్ మ్యాచ్ రూల్స్ ఇవే
1. ఒక్కో ఇన్నింగ్స్‌కు 100 బాల్స్.
2. ప్రతి 10బాల్స్ తర్వాత ఎండ్ చేంజ్ కావాలి.
3. బౌలర్లు ఒకసారి అయిదు లేదా పది బంతులను వేయొచ్చు.
4. ప్రతి బౌలర్ గరిష్ఠంగా 20బాల్స్ వేయొచ్చు.
5. ప్రతి బౌలింగ్ జట్టుకు రెండున్నర నిమిషాల స్ట్రాటెజిక్ టైమ్ ఔట్ ఉంటుంది.
6. ప్రతి జట్టుకు తొలి 25 బంతుల వరకు పవర్‌ప్లే ఉంటుంది.
7. పవర్‌ప్లే సమయంలో 30యార్డ్స్ సర్కిల్ వెలుపల ఇద్దరు ఫీల్డర్లు మాత్రమే ఉంటారు.
8. క్యాచ్ అవుట్ అయితే నాన్ స్ట్రైక్ ఎండ్లో ఉన్న ప్లేయర్ బ్యాటింగ్లోకి రావాలి.
9. నో బాల్‌కు రెండు ఎక్స్ ట్రా పరుగుల, తర్వాతి బంతికి ఫ్రీ హిట్
10. స్లో ఓవర్ రేట్ గనుక బౌలింగ్ యూనిట్ చేస్తే.. ఆఖరి ఓవర్‌లో 30యార్డ్స్ సర్కిల్ అవతల ఒక ఫీల్డర్ తక్కువగా అనుమతిస్తారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications