ఐపీఎల్ 2019: 3వ ఇంగ్లీషు క్రికెటర్‌గా బెయిర్ స్టో అరుదైన రికార్డు

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్‌లో ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓపెనర్ జానీ బెయిస్ స్టో అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో బెయిర్ స్టో 56 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సుల సాయంతో 114 పరుగులు చేశాడు. ఫలితంగా ఐపీఎల్‌లో సెంచరీ నమోదు చేసిన మూడవ ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్‌గా అరుదైన ఘనత సాధించాడు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
మూడో ఇంగ్లాండ్ క్రికెటర్‌గా
గతంలో ఐపీఎల్‌లో కెవిన్ పీటర్సన్(2012), బెన్ స్టోక్స్(2017)లో సెంచరీలను నమోదు చేశారు. ప్రస్తుతం కెవిన్ పీటర్సన్ ఇదే ఐపీఎల్‌లో కామెంటేటర్‌గా వ్యవహారిస్తుండగా... బెన్ స్టోక్స్ మాత్రం రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
ఐపీఎల్‌లో బెయిర్ స్టో తొలి సెంచరీ
కాగా, టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ జట్టులో ఓపెనర్లు తొలి వికెట్‌కి అభేద్యంగా 16.2 ఓవర్లలోనే 185 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. బెయిర్ స్టో 28 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో హాఫ్ సెంచరీ సాధించగా, మరో 24 బంతుల్లో సెంచరీ మార్కును చేరాడు.
చాహల్ బౌలింగ్‌లో ఔట్
మరోవైపు వార్నర్ 32 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో అర్థ సెంచరీ నమోదు చేయగా, మరో 22 బంతుల్లోనే సెంచరీని సాధించాడు. సెంచరీ అనంతరం బెయిర్‌స్టో... స్పిన్నర్ చాహల్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరగా ఆఖరి ఓవర్‌లో డేవిడ్ వార్నర్ కూడా సెంచరీని నమోదు చేశాడు.
వార్నర్‌కి నాలుగో సెంచరీ
ఐపీఎల్ కెరీర్‌లో డేవిడ్ వార్నర్‌కి ఇది నాలుగో సెంచరీ కాగా బెయిర్‌స్టోకి ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. 16 ఏళ్ల 157 రోజులకే ఐపీఎల్ అరంగేట్రం చేసి చరిత్ర సృష్టించిన కొత్త బౌలర్ ప్రయాస్ రే బర్మన్ అయితే తన 4 ఓవర్ల కోటాలో ఏకంగా 56 పరుగులు ఇచ్చాడు. ఉమేష్ యాదవ్ 4 ఓవర్లలో 47, చాహల్ 4 ఓవర్లలో 44 పరుగులు సమర్పించుకున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications