Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బెయిర్ స్టో హాఫ్ సెంచరీ: తొలి టీ20లో ఇంగ్లాండ్‌దే విజయం

Jonny Bairstow enjoys extra England responsibility after opening T20 batting

హైదరాబాద్: వెస్టిండిస్‌తో జరిగిన తొలి టీ20లో ఇంగ్లాండ్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లాండ్ ఆటగాడు జానీ బెయిర్‌స్టో (40 బంతుల్లో 68; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుత ప్రదర్శన చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో మూడు టీ20ల సిరిస్‌లో ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండిస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 160 పరుగులు చేసింది. నికోలస్‌ పూరణ్‌ (37 బంతుల్లో 58; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ సాధించగా... టామ్ కుర్రాన్ (4/36) దెబ్బకు డాషింగ్ ఓపెనర్ క్రిస్‌గేల్ (15), హోప్ (6), హెట్మెయర్ (14) విఫలమయ్యారు.

అయితే డారెన్ బ్రావో (28), పూరన్ నాలుగో వికెట్‌కు 64 పరుగులు జోడించడంతో వెస్టిండిస్ జట్టు గౌరవప్రదమైన స్కోరు చేసింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో టామ్‌ కరన్‌ 36 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 18.5 ఓవర్లలో 6 వికెట్లకు 161 పరుగులు చేసింది.

ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌లో ఓపెనర్‌ జానీ బెయిర్‌స్టో (40 బంతుల్లో 68; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), జో డెన్లీ (29 బంతుల్లో 30; 4 ఫోర్లు) రాణించారు.

Story first published: Thursday, March 7, 2019, 11:49 [IST]
Other articles published on Mar 7, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+