Jonny Bairstow : అవన్నీ కల్పిత వార్తలు.. నాకేం కాలేదు.. నేను బానే ఉన్నా

ఇంగ్లాండ్‌లోని బ్రిస్టల్‌లో దక్షిణాఫ్రికాతో జరగబోయే మొదటి టీ20కి ముందు.. జానీ బెయిర్ స్టో గాయపడ్డట్లు వార్తలొచ్చాయి. ఓ వీడియోలో అతను ఆల్ రౌండర్ సామ్ కరన్‌ను జిమ్‌లో ఎత్తినట్లు కన్పించడడంతో.. అందువల్లే బెయిర్ స్టో గాయపడ్డాడని పుకార్లు షికార్లు చేశాయి. కరన్ ఎత్తుకునే క్రమంలో బెయిర్ స్టో మోకాలి గాయంతో బాధపడ్డాడని కొన్ని ఇంగ్లిష్ వెబ్ సైట్లు కూడా రిపోర్ట్ చేశాయి. అయితే ఈ విషయమై జానీ బెయిర్‌స్టో స్పందించాడు. తాను ఫిట్‌గా ఉన్నానని, ఈ రోజు జరిగే టీ20 సిరీస్ ఓపెనర్ మ్యాచ్‌కు అందుబాటులో ఉన్నాడని చెప్పాడు.
ఇకపోతే ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ రీస్ టోప్లీ.. బెయిర్ స్టో.. కరన్‌ను ఎత్తుతున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా అది వైరల్ అయింది. కరన్‌ను బెయిర్‌స్టో జిమ్‌లో ఎత్తుకుని వాకింగ్ చేస్తున్నట్లు వీడియోలో కన్పించింది. భుజాలపై ఎత్తుకున్నాక బెయిర్ స్టో పూర్తిగా ఇబ్బంది పడ్డట్లు కన్పించాడు. అతని ముఖం చిట్లిస్తూ భారంగా వాకింగ్ చేశాడు. దీంతో అతను గాయపడే ఉంటాడని అంతా భావించారు.

ఐస్ ప్యాక్‌లు, పట్టీలు పెట్టుకుని గ్రౌండ్లో ప్రాక్టీస్
బెయిర్‌స్టో అసోసియేటెడ్ ప్రెస్ ప్రకారం.. మంగళవారం బ్రిస్టల్‌లోని స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్‌కు ఐస్ ప్యాక్‌లతో, ఎడమ మోకాలికి పట్టీతో బెయిర్ స్టో రావడం కన్పించింది. ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న వికెట్‌కీపర్ కం బ్యాటర్ అయిన బెయిర్ స్టో లాకర్ రూమ్‌కి తిరిగి వెళ్లేటప్పుడు చాలా అసౌకర్యంగా నడుస్తూ కన్పించాడు. ఏదేమైనప్పటికీ బెయిర్‌స్టో అతను ఫిట్‌గా ఉన్నాడని, ప్రోటీస్‌తో జరగబోయే 3మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి టీ20లో ఆడడానికి సిద్ధంగా ఉన్నానని తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.
అందుకే స్పష్టత ఇస్తున్నా
'నేను గాయపడ్డట్టు వస్తున్న వార్తల విషయమై ఓ స్పష్టత ఇవ్వడానికి ఈ పోస్ట్ చేస్తున్నా. నేను జిమ్‌లో కరన్‌ను ఎత్తుకోవడంతో గాయపడ్డానని పలు కథనాలు తప్పుగా ప్రచురించారు. అదేం లేదు. నేను ఫిట్‌గా ఉన్నాను. తొలి టీ20 సెలెక్షన్స్‌కు అందుబాటులో ఉన్నాను' అని బెయిర్‌స్టో తన ఇన్‌స్టాగ్రామ్ కథనంలో పేర్కొన్నాడు. అతను గాయపడ్డాడని పేర్కొన్న బ్రిటిష్ మీడియా నివేదికను కూడా పోస్ట్ చేశాడు. 'నేను గాయపడితే.. నేను సామ్‌ను ఎలా పైకి లేపగలను' అని కూడా బెయిర్ స్టో తెలిపాడు.

వాళ్లిద్దరిలో ఒకరు ఔట్..
ఇకపోతే ఇంగ్లాండ్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య మూడు టీ20ల సిరీస్ జరగబోతుంది. ఇక నేడు రేపు వరుస రోజుల్లో 2 టీ20 మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ టీ20 మ్యాచ్‌కు ఇంగ్లాండ్ తమ ప్లేయింగ్ 11ను ఎలా కూర్పు చేస్తుందో చూడాలి. భారత్‌తో టీ20 సిరీస్‌కు బెయిర్‌స్టోకు విశ్రాంతి ఇవ్వడంతో ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్‌లో ఫిల్ సాల్ట్, హ్యారీ బ్రూక్‌లు ఆడారు. బెయిర్ స్టో గనుక తుది జట్టులో ఉంటే.. వీరిద్దరిలో ఒకరు తప్పుకుంటారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ తరఫున అన్ని ఫార్మాట్లలో అద్భుతమైన ఫామ్‌లో బెయిర్ స్టో ఉన్న సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications