
రెండు, మూడు టెస్టుల్లో మ్యాచ్ విన్నర్‌గా..
నాటింగ్‌హామ్‌లో జరిగిన రెండో టెస్టు చివరి రోజున బెయిర్‌స్టో 136పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడడంతో ఇంగ్లాండ్ 299పరుగుల లక్ష్యాన్ని ఛేదించి గెలుపొందింది. టెస్ట్ క్రికెట్‌లో ఇంగ్లాండ్ తరఫున రెండో వేగవంతమైన సెంచరీ సాధించిన ప్లేయర్‌గా కూడా బెయిర్ స్టో నిలిచాడు. 32ఏళ్ల బెయిర్ స్టో లీడ్స్‌లో జరిగిన సిరీస్‌లోని చివరి టెస్టులో అనూహ్య రీతిలో చెలరేగాడు. ఇంగ్లాండ్ 55పరుగులకే 6వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ సమయంలో తొలి ఇన్నింగ్స్‌లో 162పరుగులతో చెలరేగిన బెయిర్ స్టో.. రెండో ఇన్నింగ్స్‌లో 71పరుగులు నాటౌట్‌గా నిలిచి జట్టుకు మరో థ్రిల్లింగ్ విజయాన్ని కట్టబెట్టాడు. తద్వారా ఇంగ్లాండ్.. డిఫెండింగ్ టెస్ట్ ఛాంపియన్స్ అయిన న్యూజిలాండ్‌ను 3-0తేడాతో క్లీన్ స్వీప్ చేయగలిగింది.

భారత్ మీద బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు
ఇక ఈ నెల ప్రారంభంలో బర్మింగ్‌హామ్‌లో భారత్‌తో తిరిగి రీషెడ్యూల్డ్ టెస్టులో కూడా బెయిర్‌స్టో తన ప్రతాపాన్ని కొనసాగించాడు. బెయిర్‌స్టో రెండు ఇన్నింగ్స్‌లలో బ్యాక్-టు-బ్యాక్ సెంచరీలు చేసి ఇంగ్లాండ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఇకపోతే ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపికవ్వడం పట్ల బెయిర్ స్టో సంతోషం వ్యక్తం చేశారు. 'ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా నాకు ఓటు వేసినందుకు అభిమానులకు నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను' అని బెయిర్‌స్టో తెలిపాడు. ఇక ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌ను నిర్ణయించడంలో అభిమానుల ఓట్లు చాలా కీలకమనే సంగతి తెలిసిందే.

అపారమైన ఆత్మవిశ్వాసంతో ఇంగ్లాండ్ టీం
'ఇంగ్లాండ్‌కు గత ఐదువారాలు నమ్మశక్యం కానీ రీతిలో గడిచాయి. న్యూజిలాండ్, భారత్ లాంటి హై-క్లాస్ ప్రత్యర్థఉలపై గెలుపొందడగం, వరుసగా నాలుగు విజయాలు సాధించడం గర్వంగా ఉంది. మేము ఫియర్ లెస్ క్రికెట్‌ను బాగా ఆస్వాదిస్తున్నాము. మా ఆటలో స్పష్టత, పాజిటివిటీ ఉంది. ఈ టైంలో నేను నాలుగు సెంచరీలు చేసినప్పటికీ.. ప్రతి విభాగంలోనూ అద్భుతంగా రాణించి అపారమైన ఆత్మవిశ్వాసంతో ఆడుతున్న నా టీం మేట్స్ యొక్క అనితర ప్రదర్శనను నేను అభినందిస్తున్నాను' బెయిర్ స్టో పేర్కొన్నాడు.

టెస్ట్ క్రికెట్లో ఇలాంటి ఆటగాళ్లు చాలా స్పెషల్
ఇకపోతే జానీ బెయిర్‌స్టో జూన్ మంత్‌కు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా నిలవడం సరైనదేనని శ్రీలంక మాజీ అంతర్జాతీయ ప్లేయర్, ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ ఓటింగ్ ప్యానెల్ సభ్యుడు ఫర్వీజ్ మహరూఫ్ అన్నాడు. 'జానీ తన దూకుడు ఆటతో జట్టు విజయాల్లో కీలక పాత్రను పోషించాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్స్ అయిన న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్ రూపురేఖలు మార్చేసే విషయంలో అతని ఎదురుదాడి అద్భుతమనే చెప్పాలి. అతని అద్భుతమైన నాక్స్ వల్ల ఇంగ్లాండ్ సిరీస్‌ను గెలుచుకుంది. టెస్టు క్రికెట్‌లో ఇలాంటి ఆటగాళ్లు చాలా స్పెషల్. నా అభిప్రాయం ప్రకారం అతను ఈ గుర్తింపుకు పూర్తిగా అర్హుడు.' అని ప్రశంసించారు.


Click it and Unblock the Notifications
