IPL 2021: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ షాక్.. ఐపీఎల్ నుంచి తప్పుకున్న స్టార్ ప్లేయర్! మరో ఇద్దరు కూడా ఔట్!!

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 రెండో దశ మ్యాచులు సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దుబాయ్, షార్జా, అబుదాబిలో కఠిన బయో బబుల్ వాతావరణంలో ఐపీఎల్ 2021 మ్యాచులు జరగనున్నాయి. సెప్టెంబరు 19న చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగే పోరుతో ఐపీఎల్ 2021లోని మిగిలిన మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. అయితే ఐపీఎల్ 2021 ఆరంభానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) జట్టుకు భారీ షాక్ తగిలింది. ఎస్‌ఆర్‌హెచ్ స్టార్ ప్లేయర్ ఐపీఎల్ 2021 రెండో దశ మ్యాచులకు అందుబాటులో ఉండడని తెలుస్తోంది.

బెయిర్‌స్టో ఔట్:
సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ జానీ బెయిర్‌స్టో ఐపీఎల్ 2021 రెండో దశ నుంచి వైదొలిగినట్లు సమాచారం తెలుస్తోంది. బెయిర్‌స్టో ఐపీఎల్ 2021 రెండో దేశ మ్యాచులకు అందుబాటులో ఉండడని ఈవినింగ్ స్టాండర్డ్ యూకే తమ నివేదికలో పేర్కొంది. అయితే బెయిర్‌స్టో ఎందుకు తప్పుకున్నాడో అనే విషయం మాత్రం వెల్లడించలేదు. కీలక ప్లేయర్ అయిన బెయిర్‌స్టో జట్టుకు దూరమవడంతో ఎస్‌ఆర్‌హెచ్ ఫాన్స్ ఆందోళన చెందుతున్నారు. బెయిర్‌స్టోతో పాటు పంజాబ్ కింగ్స్ హిట్టర్ డేవిడ్ మలన్, ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ కూడా ఐపీఎల్ టోర్నీ నుంచి తప్పుకున్నారట. ఈ ముగ్గురు టీమిండియాతో జరిగిన టెస్ట్ సిరీసులో ఆడిన విషయం తెలిసిందే. వేరు తప్పుకోవడానికి కరోనా అనే తెలుస్తోంది. టెస్ట్ సిరీస్ ఆడిన ఇంగ్లండ్ ప్లేయర్స్ వరుసగా టోర్నీ నుంచి తప్పుకుంటున్నారు.

రాజస్థాన్ జట్టుకు షాకే:
మానసిక ఆరోగ్య సమస్యలతో స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ (రాజస్థాన్ రాయల్స్), వ్యక్తిగత కారణాలతో వికెట్ కీపర్ జోస్ బట్లర్ (రాజస్థాన్ రాయల్స్).. గాయం కారణంగా జోఫ్రా ఆర్చర్ (రాజస్థాన్ రాయల్స్) ఇప్పటికే ఐపీఎల్ 2021 టోర్నమెంట్ నుండి వైదొలగారు. రాజస్థాన్ రాయల్స్ జట్టుకే ఆడుతున్న ఈ ముగ్గురు స్టార్ ప్లేయర్స్ అందుబాటులో లేకపోవడంతో ఆ జట్టు బలహీనపడింది. ప్రత్యామ్యాయ ఆటగాళ్లను రాజస్థాన్ తీసుకున్నా.. ఈ ముగ్గురు లేకపోవడం భారీ ఎదురుదెబ్బే అని చెప్పాలి. బట్లర్ స్థానాన్ని వెస్టిండీస్ హిట్టర్ ఎవిన్ లూయిస్‌తో, స్టోక్స్ ప్లేస్‌ను ఒషేనే థోమాస్‌తో రీప్లేస్ చేసింది. థోమాస్ ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్ జట్టుకు 4 మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉండగా.. లూయిస్ ఇదే మొదటిసారి ఆడడం. ఈ ఇద్దరు రాజస్థాన్ జట్టుకు కీలకం కానున్నారు.

అందుబాటులో అలీ, కరన్, మోర్గాన్:
చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్‌లు మొయిన్ అలీ, సామ్ కరన్ తమ జట్టుకు అందుబాటులో ఉండనున్నారు. ఇక కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కూడా ఐపీఎల్ 2021 ఆడనున్నాడు. వీరంతా శనివారం రాత్రి లేదా ఆదివారం ఉదయం తమ కుటుంబాలతో సహా వేర్వేరు విమానాల్లో యూఏఈకి ఎగిరిపోనున్నారు. రవీంద్ర జడేజా, చెతేశ్వర్ పుజారా, శార్దూల్ ఠాకూర్, మొయిన్ అలీ, సామ్‌కరన్.. ఈ ఐదుగురిని కమర్షియల్ విమానంలో తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ వెల్లడించారు. కోల్‌కతా కూడా తమ ఆటగాళ్లను కమర్షియల్ విమానంలోనే యూఏఈ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోందట.

సొంత ఖర్చులతో:
ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ పూర్తయ్యాక బీసీసీఐ ఇరు జట్ల ఆటగాళ్లను మాంచెస్టర్ నుంచి దుబాయ్‌కు తరలించేందుకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేయాలనుకుంది. ఒక బయో బుడగ నుంచి మరో బుడగలోకి ఆటగాళ్లను ప్రవేశ పెడితే క్వారంటైన్ నిబంధనలు కలిసి వస్తాయని భావించింది. అయితే చివరి టెస్టు రద్దవ్వడంతో బీసీసీఐ ఆ ఏర్పాట్లు చేయడం లేదని ఓ ఫ్రాంఛైజీ ప్రతినిధి తెలిపారు. ఈ నేపథ్యంలోనే తమ ఆటగాళ్లను సొంత ఖర్చులతో తీసుకొస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మాంచెస్టర్ నుంచి దుబాయ్‌కు చేరుకునే ఇరు జట్ల క్రికెటర్లు కచ్చితంగా ఆరు రోజుల క్వారంటైన్‌లో ఉంటారని ఆయన చెప్పారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications