Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫిట్‌గా లేకుండానే ఐపీఎల్‌లో ఆడగలిగారా..??

John Gloster not too convinced about high cut off in Yo-Yo test

హైదరాబాద్: ఇంగ్లాండ్ పర్యటనకు ఐపీఎల్ జరుగుతుండగానే జట్టును ఎంపిక చేసింది బీసీసీఐ. అయితే, ఆ తర్వాత పర్యటనకు వెళ్లాలంటే కచ్చితంగా యోయో టెస్టులో పాసవ్వాల్సిందేనని చెప్పడంతో మళ్లీ టెస్టు నిర్వహించి కొందరు ఆటగాళ్లను మినహాయించారు. ఈ వ్యవహారంపై బీసీసీఐపై క్రికెటర్లతో పాటు పలువురు ప్రముఖులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

అంబటి రాయుడు, మహమ్మద్‌ షమి, సంజు శాంసన్‌.. వీరంతా ఇప్పుడు యో యో టెస్టు ఫెయిలై భారత జట్టులో స్థానం కోల్పోయిన ఆటగాళ్లు. తాజాగా గతంలో భారత జట్టుకు ఫిజియోగా పనిచేసిన జాన్‌ గ్లోస్టర్‌ కూడా ఈ విషయంపై ఆటగాళ్లకు మద్దతుగా నిలిచాడు.

'అంబటి రాయుడు, మహమ్మద్‌ షమి, సంజు శాంసన్‌... వీరంతా ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆడారు. ఫిట్‌గా లేకపోతే ఐపీఎల్‌లో ఎలా ఆడగలరు. రాయుడు అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు. చెన్నై సూపర్‌కింగ్స్‌ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. మరో పక్క శాంసన్‌ అద్భుతమైన క్యాచ్‌లు పట్టాడు. వీరు ఫిట్‌గా లేకపోతే ఇలాంటి ప్రదర్శన ఎలా ఇవ్వగలిగారు' అని జాన్‌ ప్రశ్నించాడు. 'ఐపీఎల్‌లో నేను రాజస్థాన్‌ రాయల్స్‌కు ఫిజియోగా పని చేశాను. ఈ సమయంలో సంజు శాంసన్‌ను చాలా దగ్గర నుంచి గమనించాను. అతడు చాలా ఫిట్‌గా ఉన్నాడు' అని జాన్‌ తెలిపాడు.

ప్రస్తుతం యో యో బెంచ్‌‌ మార్క్‌ 16.1. ఈ మార్కును అందుకుంటేనే ఆటగాళ్లు ఫిట్‌గా ఉన్నట్లు తేల్చి బీసీసీఐ భారత జట్టులో చోటు కల్పిస్తోంది. 'ఈ బెంచ్‌ మార్క్‌ అందరూ అందుకోలేరు. దీన్ని కుదించాల్సిన అవసరం ఉంది. దీన్ని పరిగణనలోకి తీజుకుని ఆటగాళ్లను జట్టులోకి ఎంచుకోవడం సరికాదు. యో యో ఒక్క టీ20లకే అవసరం. మితగా వన్డే, టెస్టు క్రికెట్‌కు అవసరం లేదని నేను అనుకుంటున్నాను' అని జాన్‌ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.

Story first published: Wednesday, June 20, 2018, 20:33 [IST]
Other articles published on Jun 20, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+