Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అసలేముంది?: రాహుల్ ద్రవిడ్ కొటేషన్‌ అంతలా నచ్చింది

John Cena Just Posted A Rahul Dravid Quote On His Instagram & Indian Cricket Fans Lost Their Shit

హైదరాబాద్: భారత్ క్రికెట్‌ అందించిన అత్యుత్తమ ఆటగాళ్లలో 'ది వాల్' రాహుల్ ద్రవిడ్ ఒకరు. కష్టాల్లో ఉన్నప్పుడు జట్టుకు పెద్ద దిక్కుగా నిలవడంతో పాటు, వికెట్లకు అడ్డుగా నిలిచి, ప్రత్యర్ధి జట్టు బౌలర్లకు ముచ్చెమటలు పోయించి, జట్టు విజయంలో కీలకపాత్ర పోషించడం రాహుల్ ద్రవిడ్ ప్రత్యేకత.

రాహుల్ ద్రవిడ్ అంటే ఇష్టపడని క్రికెట్ ఉన్నాడంటే అతిశయోక్తి కాదు. తన ప్రవర్తనతో భారత్‌లోని ఎంతో మంది యువ క్రికెటర్లకు రాహుల్ ద్రవిడ్ ఆదర్శంగా నిలిచాడు. అలాంటి ఆటగాడు చెప్పిన ఓ మాట డబ్ల్యుడబ్ల్యుఈ సూపర్‌ స్టార్‌, హాలీవుడ్‌ హీరో జాన్‌ సెనాను బాగా ఆకర్షించింది.

ఇంకేముంది రాహుల్ ద్రవిడ్ కొటేషన్‌ 'ఆటగాడు ప్రతీకారం కోసం కాదు.. గౌరవ మర్యాదల కోసం ఆడాలి' ను జాన్ సెనా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. పైగా తన ఫోటోలకు వివరణ కోరవద్దంటూ పేర్కొన్నాడు. దీంతో పాటు కపిల్‌ దేవ్, అమితాబ్‌లు కలిసి ఉన్న ఓ ఫోటోను కూడా పోస్టు చేశాడు.

ఈ ఫోటోలు భారత అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి. ప్రస్తుతం రాహుల్ ద్రవిడ్ అండర్‌ -19 క్రికెట్‌ జట్టు కోచ్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక జాన్ సెనా
విషయానికి వస్తే రెజ్లింగ్‌తో పాటు రెండు హాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్నారు.

Story first published: Friday, December 15, 2017, 10:55 [IST]
Other articles published on Dec 15, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+