Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

దక్షిణాఫ్రికా Vs భారత్: 28 ఏళ్లలో భారత్‌ ఇలా మూడో సారి

Johannesburg Test:this is only the third time india fielding

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్ లోనే భారత్‌కు ఇది మూడో సారి. బుధవారం జరుగుతున్నమూడో టెస్టు నేపథ్యంలో భారత ఆటగాళ్ల నుంచి క్రికెట్ అభిమానులకు సైతం జట్టు విజయం గురించే సందేహం. అయితే ఈ సారి విమర్శలకు తావివ్వకూడదనుకున్న కోహ్లీ జట్టులో మార్పులను చేశాడు.

ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో తలపడనున్న భారత జట్టులో ఒక్క స్పిన్నర్ కూడా లేరు. ఇలా జరగడం మొదటి సారి కాదు. మూడోసారి. దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న మూడో టెస్టులో టాస్ గెలిచిన భారత జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రెండు టెస్టుల్లోనూ టాస్ గెలిచిన డుప్లెసిస్ బ్యాటింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే.

భారత జట్టులో రోహిత్ శర్మను తప్పించి విదేశాల్లో మెరుగైన రికార్డు ఉన్న రహానెకు తుది జట్టులో చోటు కల్పించారు. అశ్విన్ స్థానంలో భువనేశ్వర్ కుమార్‌కు అవకాశం ఇచ్చారు. దక్షిణాఫ్రికా కూడా స్పిన్నర్ లేకుండానే బరిలో దిగింది. ఈ మ్యాచ్‌లో ఒక్క స్పిన్నర్ కూడా లేకుండానే టీమిండియా బరిలో దిగడం ఇది మూడోసారి కావడం గమనార్హం.

1992లో సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్ నలుగురు పేసర్లతోనే ఆడింది. ఆ మ్యాచ్‌లో టీమిండియా తరఫున శ్రీనాథ్, బెనర్జీ, కపిల్, ప్రభాకర్ బరిలో దిగాడు. 2012లో వాకాలో జరిగిన మ్యాచ్‌లోనూ భారత్ పేస్‌బౌలింగ్‌నే నమ్ముకుంది. ఇషాంత్ శర్మ, జహీర్, ఉమేశ్, వినయ్‌ కుమార్‌లు ఆ టెస్టులో బౌలింగ్ చేశారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, January 24, 2018, 15:13 [IST]
Other articles published on Jan 24, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+