Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సౌతాఫ్రికాకు షాక్: న్యూజిలాండ్‌కు ధోనీగా మారిన ఎలియోట్

అక్లాండ్: ప్రపంచ కప్‌లో భాగంగా సెమీఫైనల్లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఎలియోట్ న్యూజిలాండ్‌కు మహేంద్ర సింగ్ ధోనీ అయ్యాడని చెప్పవచ్చు. గత ప్రపంచ కప్‌లో ధోనీ చివరలో సిక్స్ కొట్టి భారత్‌కు కప్ అందించాడు. ఇప్పుడు ఎలియోట్ చివరి ఓవర్లో సిక్స్ కొట్టి కివీస్‌ను ఫైనల్‌కు చేర్చాడు. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో.. ఓ సమయంలో సౌతాఫ్రికా గెలుస్తుందని భావించారు.

కానీ, మరో రెండు బంతులు ఉన్నాయనగా.. ఐదో బంతికి సిక్స్ కొట్టి మరో బంతి మిగిలి ఉండగానే సౌతాఫ్రికా పైన కివీస్ గెలిచేలా చేశాడు. ఎలియోట్ పూర్తి పేరు గ్రాండ్ డేవిడ్ ఎలాయిట్. అతను జొహన్నస్ బర్గ్‌లో జన్మించాడు. అతను డెల్ స్టెయిన్ బౌలింగులో సిక్స్ కొట్టి సౌతాఫ్రికాను ఇంటికి పంపించాడు.

 Johannesburg-born Grant Elliott does a Dhoni to knock South Africa out of World Cup

తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 43 ఓవర్లలో 281 పరుగులు చేసింది. మ్యాచ్‌కు వర్షం అడ్డంకి కావడంతో.. డక్ వర్తలూయిస్ పద్ధతి ప్రకారం.. న్యూజిలాండ్ లక్ష్యాన్ని 43 ఓవర్లలో 298గా చేశారు. న్యూజిలాండ్ తరఫున అందరు బాగానే ఆడారు. అయితే, చివరి వరకు మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. నరాలు తెగే ఉత్కంఠగా మ్యాచ్ సాగింది.

ఎలియోట్ 73 బంతుల్లో 84 పరుగులు చేశాడు. దీంతో కివీస్ నాలుగు వికెట్ల తేడాతో మరో బంతి మిగిలి ఉండగానే గెలిచింది. 2011 ప్రపంచ కప్ సెమీ ఫైనల్లో ధోనీ కూడా భారత్‌ను ఇలాగే గెలిపించాడు. నాడు భారత్ గెలుపు కోసం చివరి రెండు బంతుల్లో 5 పరుగులు చేయాలి. అప్పుడు ధోనీ సిక్స్ కొట్టి గెలిపించాడు. ఇప్పుడు ఎలియోట్ కూడా సిక్స్ కొట్టి గెలిపించాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+