Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గుర్తున్నాడా?: డీఎస్పీగా 2007 టీ20 వరల్డ్‌కప్ హీరో

న్యూఢిల్లీ: 2007లో జరిగిన ఐసీసీ వరల్డ్ టీ20 టోర్నమెంట్‌లో భారత్ జట్టు వరల్డ్ కప్‌ను సాధించడంలో జట్టులో కీలక పాత్ర పోషించిన మాజీ క్రికెటర్ జోగిందర్ శర్మ ప్రస్తుతం హర్యానా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో డీఎస్పీగా పనిచేస్తున్నారు. ఆనాటి వరల్డ్ కప్ హీరోగా యావత్ భారతావని చేత జేజేలు పలికించుకున్న జోగిందర్ సింగ్ క్రికెట్ కెరీర్ అర్ధాంతరంగా ముగిసింది.

టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని భారత జట్టు 2007లో తొలిసారి ఐసీసీ వరల్డ్ టీ20 టైటిల్‌ను చేజిక్కించుకుంది. పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో జోగిందర్ శర్మ అధ్భుతమైన బౌలింగ్ చేసి భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Joginder sharma hero of 2007 world cup now is DSP in haryana police

ఆ తర్వాత తన ఫామ్‌ను నిలబెట్టుకోలేని జోగిందర్ శర్మ క్రమ క్రమంగా జట్టుకు దూరమయ్యాడు. 2011లో దారుణమైన రోడ్డు ప్రమాదంలో గాయపడిన శర్మ ఆ గాయల నుంచి పూర్తిగా కోలుకుని ప్రస్తుతం హర్యానా పోలీసు శాఖలో డీఎస్పీగా పని చేస్తున్నారు. వరల్డ్ టీ20లో భారత జట్టు ఫేవరేట్‌గా బరిలో దిగుతున్న విషయంపై ఆయన స్పందించారు. ేేే

వరల్డ్ కప్ టైటిల్‌ను కైవసం చేసుకునే సత్తా భారత జట్టుకు ఉందని టీమిండియా మాజీ స్పిన్నర్ జోగిందర్ శర్మ అభిప్రాయపడ్డారు. టీ20 క్రికెట్ ఫలితాలను ఎవరూ ఊహించడం సాధ్యం కాదన్నారు. టీ20ల్లో భారత జట్టు పటిష్టంగా ఉందని, అనుభవమున్న బౌలర్లు జట్టులో ఉన్నారని, బలమైన బ్యాటింగ్‌తో పాటుగా ఫీల్డింగ్‌లో టీమిండియా రాణిస్తుందన్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+