Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జోఫ్రా నీ పాస్ పోర్టు చూపించు: ఆర్చర్‌ను గేలి చేసిన ఆస్ట్రేలియా అభిమానులు

Jofra, show us your passport: Australia fans thrown out of Old Trafford after abusing Archer

హైదారాబాద్: "జోఫ్రా నీ పాస్ పోర్టు చూపించు" అంటూ ఆస్ట్రేలియా అభిమానులు ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌ను గేలి చేశారు. యాషెస్ సిరిస్ అంటేనే చాలు ఆటు ఆటగాళ్లతో పాటు ఇటు అభిమానులు సైతం ఎంతో సీరియస్‌గా తీసుకుంటారు. ఈ సిరిస్‌లో కొన్ని సందర్భాల్లో ఫ్యాన్స్ అనుచితంగా కూడా ప‍్రవర్తిస్తుంటారు.

ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య బుధవారం ప్రారంభమైన నాలుగో టెస్టులో ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో జోఫ్రా ఆర్చర్‌ బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో ఆసీస్‌ అభిమానులు తిట్ల దండకం అందుకున్నారు.

ఆర్చర్‌ను ఉద్దేశించి హేళనగా

ఆర్చర్‌ను ఉద్దేశించి హేళనగా

కరేబియన్ దీవుల్లోని బార్బడోస్‌కు చెందిన జోఫ్రా ఆర్చర్ ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టుకు ఆడుతోన్న సంగతి తెలిసిందే. దీనిని దృష్టిలో పెట్టుకుని "ఈ బార్బోడాస్‌ హెరిటేజ్‌ టెస్టు చాలా చప్పగా ఉంది" అంటూ ఆర్చర్‌ను ఉద్దేశించి హేళనగా మాట్లాడారు. మరొక అభిమాని అయితే "జోఫ్రా నీకు పాస్‌పోర్ట్‌ ఉందా. ఒకసారి నీ పాస్‌పోర్ట్‌ చూపించు" అంటూ గేలిగా మాట్లాడారు

ఇంగ్లాండ్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌కు సమీపంలోనే

ఇంగ్లాండ్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌కు సమీపంలోనే

ఇంగ్లాండ్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌కు సమీపంలోనే కూర్చొని ఉన్న ఆస్ట్రేలియా అభిమానులు ఇలా అనుచితంగా ప‍్రవర్తించడంతో వెంటనే ఈ విషయాన్ని స్టేడియం సిబ్బంది పోలీసులు దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత వారిని స్టేడియం నిర్వాహకులు బయటకు పంపించివేశారు. అయితే, యాషెస్ సిరిస్‌లో ఆటగాళ్లను ఇలా ఎగతాళి చేయడం ఇదే మొదటిసారి కాదు.

చీటర్‌ చీటర్ అంటూ ఇంగ్లాండ్ అభిమానులు ఎగతాళి

చీటర్‌ చీటర్ అంటూ ఇంగ్లాండ్ అభిమానులు ఎగతాళి

లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ను చీటర్‌ చీటర్ అంటూ ఇంగ్లాండ్ అభిమానులు ఎగతాళి చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అప్పట్లో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు పెద్ద ఎత్తున స్పందించారు. సెంచరీ చేసిన స్టీవ్ స్మిత్‌ను అభినందించాల్సిందిపోయి ఇలా ఎగతాళి చేయడం ఎంతమాత్రం సరికాదని మండిపడ్డారు.

తొలి రోజు కేవలం 44 ఓవర్లే

తొలి రోజు కేవలం 44 ఓవర్లే

ఇదిలా ఉంటే, నాలుగో టెస్టుకు పలుమార్లు వర్షం అంతరాయం కలిగించడంతో తొలి రోజు కేవలం 44 ఓవర్లే సాధ్యపడింది. దీంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా మూడు వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. క్రీజులో మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌(60 నాటౌట్‌), ట్రావిస్‌ హెడ్‌(18 నాటౌట్‌) పరుగులతో ఉన్నారు.

వరుసగా నాలుగో హాఫ్‌ సెంచరీ

వరుసగా నాలుగో హాఫ్‌ సెంచరీ

ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌(0), మార్కస్‌ హారిస్‌(13)లు నిరాశపరిచినప్పటికీ లబుషేన్‌(67) బాధ్యతాయుతంగా ఆడాడు. ఈ క్రమంలో లబుషేన్‌ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సిరీస్‌లో అతడికిది వరుసగా నాలుగో హాఫ్‌ సెంచరీ. 32 ఓవర్లకు పైగా ఇంగ్లిష్‌ బౌలర్లను అడ్డుకున్న వీళ్లిద్దరూ మూడో వికెట్‌కు 116 పరుగులు జోడించి ఓవర్‌టన్‌ బౌలింగ్‌లో లబుషేన్‌ బౌల్డయ్యాడు.

Story first published: Thursday, September 5, 2019, 14:33 [IST]
Other articles published on Sep 5, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+