న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆర్చర్‌కి రెండోసారి కరోనా నెగటివ్.. విండీస్ సిరీస్‌కి లైన్‌ క్లియర్!!

Jofra Archer tests Coronavirus negative for a second time

లండన్: ఇంగ్లండ్ స్టార్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ కరోనా వైరస్ పరీక్షలో విజయవం అయ్యాడు. ఆర్చర్‌కి రెండోసారి నెగెటివ్‌ రావడంతో వెస్టిండీస్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో తలపడే ఇంగ్లండ్ జట్టులో అతను చేరనున్నాడు. ఇక సౌథాంప్టన్‌లో తన సహచరులతో కలిసి సాధన చేయబోతున్నాడు. ఇంగ్లండ్-వెస్టిండ్‌ మధ్య రోజ్ బౌల్ క్రికెట్ గ్రౌండ్‌లో జూలై 8న తొలి టెస్టు ప్రారంభం కానుంది. బయో సెక్యూర్‌ వాతావరణంలో టెస్టులను ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిర్వహిస్తోంది.

ఈ సిరీస్‌కి నెల రోజుల ముందే వెస్టిండీస్ జట్టుని పిలిపించుకున్న ఈసీబీ.. విండీస్‌ టీమ్‌తో పాటు ఇంగ్లండ్ క్రికెటర్లకి కూడా కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించింది. ఈ నెల 3 నుంచి 23 వరకూ కరోనా పరీక్షలు నిర్వహించారు. మొత్తం 702 పరీక్షలు నిర్వహించగా.. ఎవరికీ వైరస్‌ సోకలేదని ఈసీబీ నిర్ధారించింది. అయితే క్యాంప్ ఇటీవల ప్రారంభమవగా.. జోప్రా ఆర్చర్ ఇంట్లో ఒకరు అనారోగ్యంతో ఉండడంతో ముందస్తు జాగ్రత్త చర్యగా అతడ్ని క్యాంప్‌కి ఈసీబీ అనుమతించలేదు.

జోప్రా ఆర్చర్‌కి ఈసీబీ ఇటీవల కరోనా వైరస్ టెస్టులు నిర్వహించింది. అందులో నెగటివ్ వచ్చినా.. గురువారం రెండోసారి పరీక్షలు నిర్వహించింది. మరోసారి నెగటివ్ రావడంతో.. అతడ్ని ఇంగ్లండ్ టీమ్‌తో చేరేందుకు అనుమతిస్తున్నట్లు ఈసీబీ తెలిపింది. మొత్తం 702 కరోనా టెస్టులు నెగటివ్‌‌గా తేలగా.. చివరగా ఆర్చర్‌ రిపోర్ట్‌తో సిరీస్‌‌‌కి లైన్ క్లియరైంది. మరోవైపు విండీస్ జట్టుకు వైరస్ టెస్టులు నిర్వహించినా.. అందరికి నెగటివ్ వచ్చింది. దాంతో వారు ప్రాక్టీస్ మొదలెట్టారు.

దాదాపు మూడు నెలల విరామం తర్వాత ట్రైనింగ్‌ కోసం ఏసెస్‌ బౌల్స్‌కు చేరిన ఇంగ్లండ్‌ టీమ్‌ను ఈసీబీ డైరెక్టర్‌ ఆష్లే జైల్స్‌ గట్టిగా హెచ్చరించాడు. ఇదేమీ హాలీడే క్యాంప్‌ కాదన్నాడు. కరోనా పొంచి ఉన్న నేపథ్యంలో కొవిడ్‌-19 ప్రొటోకాల్‌ను కచ్చితంగా పాటించాలన్నాడు. వెస్టిండీస్‌తో మూడు మ్యాచుల టెస్టు సిరీస్ ఆగేందుకు ఇంగ్లండ్ ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారని ఆయన తెలిపాడు.

టీమిండియా మాజీ క్రికెటర్‌కి జరిమానా.. కారు సీజ్!!టీమిండియా మాజీ క్రికెటర్‌కి జరిమానా.. కారు సీజ్!!

Story first published: Friday, June 26, 2020, 11:25 [IST]
Other articles published on Jun 26, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X