India vs England: విరాట్ కోహ్లీని అలా ఔట్ చేయడం.. ఇంగ్లండ్‌కు నిజమైన బోనస్! సంతోషంగా ఉంది: ఆర్చర్‌

అహ్మదాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఈ పర్యటనలో చాలాసార్లు త్వరగా ఔట్‌ చేయడం ఇంగ్లండ్‌కు నిజమైన బోనస్‌ అని ఆ జట్టు ఫాస్ట్‌ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌ అభిప్రాయపడ్డాడు. మొతేరా వేదికగా శుక్రవారం జరిగిన తొలి టీ20లో‌ కోహ్లీ డకౌటైన సంగతి తెలిసిందే. స్పిన్నర్ అదిల్ రషీద్ బౌలింగ్‌లో క్రిస్ జోర్డాన్‌కు క్యాచ్ ఇచ్చి కోహ్లీ పెవిలియన్ చేరాడు. తొలి టీ20లో‌ కోహ్లీ 5 బంతులు ఆడి డకౌట్ అయ్యాడు.

అంతకుముందు జరిగిన నాలుగో టెస్టులోనూ కోహ్లీ పరుగుల ఖాతా తెరవకముందే పెవిలియన్‌ చేరాడు. దీంతో వరుసగా రెండు ఇన్నింగ్స్‌ల్లో డకౌటయ్యాడు. ఇక రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ విరాట్‌ ఇలాగే పెవిలియన్‌ చేరాడు.

ఇంగ్లండ్‌కు నిజమైన బోనస్

ఇంగ్లండ్‌కు నిజమైన బోనస్

తొలి టీ20 అనంతరం జోఫ్రా ఆర్చర్ మీడియాతో మాట్లాడాడు.‌ 'తొలి టీ20లో మా ప్రణాళికలు కచ్చితంగా అమలవ్వడం ఎంతో సంతోషాన్నిచ్చింది. అదిల్ రషీద్‌ ప్రపంచ శ్రేణి బౌలర్‌. ఎక్కడైనా బౌలింగ్‌ చేయగల సమర్థుడు. విరాట్ కోహ్లీ ప్రమాదకర బ్యాట్స్‌మన్‌ అనే విషయం తెలిసిందే. అయితే అతడిని పదేపదే తక్కువ స్కోరుకు పరిమితం చేయడం ఇంగ్లీష్ జట్టుకు నిజమైన బోనస్. ఇది కచ్చితంగా టీమ్‌ఇండియాను నిరుత్సాహపరిచి ఉండొచ్చు.' అని ఆర్చర్ అన్నాడు.

 సంతోషంగా ఉంది

సంతోషంగా ఉంది

'ఇంగ్లండ్ జట్టు విజయంలో నేను భాగస్వామి కావడం సంతోషంగా ఉంది. ప్రత్యర్థులు బలంగా ఉంటే నాలోని అత్యుత్తమ ప్రదర్శన బయటకు వస్తుంది. నాకు ఒక వికెట్‌ దక్కినా.. మూడు వికెట్లు దక్కినా నా బౌలింగ్‌లో ఏమాత్రం మార్పు ఉండదు' అని స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌ చెప్పుకొచ్చాడు. తొలి టీ20లో మ్యాచ్‌లో ఆర్చర్‌ నాలుగు ఓవర్లు బౌలింగ్‌ చేసి.. మూడు వికెట్లు పడగొట్టి 23 పరుగులు ఇచ్చాడు. అందులో కీలకమైన కేఎల్‌ రాహుల్ ‌(1), హార్దిక్‌ పాండ్యా (19), శార్ధూల్‌ ఠాకుర్ ‌(0) వికెట్లను ఆర్చర్‌ తీశాడు. ఇక అదిల్‌ రషీద్‌ 3 ఓవర్లలో 14 పరుగులిచ్చి విరాట్‌ కోహ్లీ వికెట్ పడగొట్టాడు.

స్వల్ప స్కోర్లకే

స్వల్ప స్కోర్లకే

అంతర్జాతీయ క్రికెట్లో పరుగుల వరదకు మరోపేరుగా నిలిచిన ఆటగాడు విరాట్‌ కోహ్లీ. అత్యంత వేగంగా 1000, 2000, 3000.. 10,000 పరుగుల వంటి ఘనతలు సృష్టించాడు. ఎన్నో రికార్డులు బద్దలు కొట్టేశాడు. పిచ్‌, బౌలర్‌తో సంబంధం లేకుండా బ్యాటింగ్‌ చేయడం శతకాలు సాధించడం కోహ్లీకె చెల్లింది. అలాంటిది 2019 నుంచి అతడు పరుగులు చేయడం లేదు. ఇక సెంచరీల వైపు కన్నెత్తి చూడలేదు. చివరిసారిగా 2019 నవంబర్‌ 22న బంగ్లాదేశ్‌పై గులాబి టెస్టులో శతకం బాదాడు. వన్డేల్లోనైతే అదే ఏడాది ఆగస్టు 11న వెస్టిండీస్‌పై 120 పరుగులు చేశాడు. ఈ మధ్య కాలంలో అతడు స్వల్ప స్కోర్లకే వెనుదిరుగుతున్నాడు.

కోహ్లీపై డకౌట్‌ ట్వీట్‌

కోహ్లీపై డకౌట్‌ ట్వీట్‌

వాహనదారులకు అవగాహన కల్పించేందుకు ఉత్తరాఖండ్‌ పోలీసులు విరాట్‌ కోహ్లీ డకౌట్ అయిన ఫొటోను ఉపయోగించుకున్నారు. 'హెల్మెట్‌ ఒక్కటే సరిపోదు. పూర్తి ధ్యాసతో డ్రైవింగ్‌ చేయడం అత్యంత ఆవశ్యకం. లేకపోతే విరాట్ కోహ్లీ మాదిరిగానే మీరూ డకౌట్‌ అవుతారు' అని హిందీలో పోస్ట్‌ చేశారు. పోలీసులు చేసిన ట్వీట్‌పై అభిమానులు మండిపడ్డారు. కోహ్లీని అవమానించేలా ఉందంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ట్వీట్‌ తొలగించక తప్పలేదు.

ఇంగ్లండ్‌తో‌ రెండో టీ20.. భారత ఓపెనింగ్ జోడీలో మార్పు! స్పిన్నర్‌పై వేటు.. మూడో పేసర్‌కి చోటు! తుది జట్లు ఇవే!

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Sunday, March 14, 2021, 13:13 [IST]
Other articles published on Mar 14, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X