Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇంగ్లాండ్ ప్రిలిమినరీ ప్రపంచకప్‌ జట్టు విడుదల.. ఆర్చర్‌కు దక్కని చోటు

Jofra Archer not in Englands preliminary World Cup squad

ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి వన్డే ప్రపంచకప్‌ సమరం ప్రారంభం కానుంది. ప్రపంచకప్‌ కోసం వెళ్లే జట్లను ఒక్కో దేశం ప్రకటిస్తూ వస్తున్నాయి. అన్నిటికంటే ముందుగా న్యూజీలాండ్ జట్టు 15 మందితో కూడిన జట్టుని ప్రకటించింది. అనంతరం ఆస్ట్రేలియా, భారత్, బంగ్లాదేశ్‌ దేశాలు ప్రపంచకప్‌ జట్లను ప్రకటించాయి.

ఈ క్రమంలో తాజాగా ప్రపంచకప్‌ కోసం ఇంగ్లాండ్ సెలక్టర్లు 15 మందితో కూడిన ప్రిలిమినరీ జట్టుని ప్రకటించారు. స్టార్ బ్యాట్స్‌మన్‌ ఇయాన్ మోర్గాన్‌కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. వికెట్ కీపర్‌గా జోస్ బట్లర్‌‌ని ఎంపిక చేశారు. తాజాగా జరుగుతున్న ఐపీఎల్ 2019 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కి ఆడుతున్న జోఫ్రా ఆర్చర్‌కు ప్రిలిమినరీ ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కలేదు. ప్రిలిమినరీ జట్టుతో పాటు ఐర్లాండ్, పాకిస్థాన్ సిరీస్ లకు వెళ్లే ఇంగ్లాండ్ జట్లను సెలక్టర్లు ఎంపిక చేశారు. మొయిన్ అలీ, బెయిర్‌స్టో, స్టోక్స్, బట్లర్‌‌లకు రెండు సిరీస్ ల నుండి విశ్రాంతి కల్పించారు.

ఇంగ్లాండ్ ప్రిలిమినరీ జట్టు:

జానీ బెయిర్‌స్టో, జేసన్ రాయ్, జో రూట్, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), బెన్‌ స్టోక్స్, జోస్ బట్లర్, మొయిన్ అలీ, క్రిస్‌ వోక్స్, లియామ్ ఫ్లంకెట్, అదిల్ రషీద్, మార్క్‌వుడ్, అలెక్స్ హేల్స్, టామ్ కరన్, జో డెన్లీ, డేవిడ్ విల్లీ.

Story first published: Wednesday, April 17, 2019, 17:39 [IST]
Other articles published on Apr 17, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+