For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంగ్లాండ్ జట్టుకు శుభవార్త.. జోఫ్రా ఆర్చర్ కోలుకుని తిరిగి జట్టులోకి ఎప్పుడు రాబోతున్నాడంటే?

Jofra Archer May Recover and Comeback to England Team in Early 2023 Predicted ECB

ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ వరుస గాయాలతో జట్టుకు చాలా కాలంగా దూరమైన సంగతి తెలిసిందే. ఇక ఈ గాయాలనన్నింటిని అధిగమించి 2023ప్రారంభంలో తిరిగి జట్టులోకి అతను రాబోతున్నట్లు ఆశిస్తున్నామని ఇంగ్లాండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అప్డేట్ ఇచ్చింది. ఆర్చర్ పునరాగమనం గురించి చాలా ఆశాభావంతో ఉన్నామని.. అయినప్పటికీ జాగ్రత్తతతోనే నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొన్నట్లు 'ది టెలిగ్రాఫ్' పత్రిక ఓ వార్తాకథనాన్ని పోస్ట్ చేసింది. ఆర్చర్ మళ్లీ టీంలోకి వస్తే ఇంగ్లాండ్‌కు అది పెద్ద శుభవార్తే అవుతుంది.

ఆర్చర్ 2021 మార్చి నుంచి ఇంగ్లాండ్ జట్టు తరఫున ఆడలేదు. అతను తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ అహ్మదాబాద్‌లో భారత్‌తో జరిగిన ఐదో టీ20లో ఆడాడు. ఆ తర్వాత అతను జట్టుకు గాయంతో దూరమయ్యాడు. అలాగే జులై 2021లో కెంట్‌తో ససెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మళ్లీ అతను క్రికెట్ గ్రౌండ్లో అడుగుపెట్టాడు. అయితే గాయం తిరగబెట్టడంతో మళ్లీ అతను క్రికెట్‌‌కు దూరమయ్యాడు. ఆర్చర్ 2020 నుంచి వరుస గాయాలతో తరచూ జట్టుకు దూరమవుతూనే ఉన్నాడు.

ఇక 2021నుంచి అతను గాయాల బెడదతో పూర్తిగా జట్టుకు దూరమయ్యాడు. అతనికి మోచేతి గాయం చాలా తీవ్రంగా ఉండగా.. దాన్ని ఆపరేషన్‌ ద్వారా సరిచేశారు. ఆ తర్వాత అతను తన వేలు గాయంతో మళ్లీ జట్టుకు మిస్సయ్యాడు. తాజాగా అతను బ్యాక్ ఫ్రాక్చర్‌తో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు.

ఇకపోతే ఆర్చర్‌ను 2022 మెగా వేలంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. అయితే.. అతను 2022 టోర్నీలో గాయం కారణంగా ఆడలేదు. ఆర్చర్‌ని సదరన్ బ్రేవ్ టీం ది హండ్రెడ్‌ టోర్నీ కోసం కొనుగోలు చేసింది. ఆ టోర్నీలోను ఆర్చర్ ఆడలేదు. వచ్చే ఏడాది ప్రారంభంలో దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్ కోసం ఆర్చర్ ఇంగ్లాండ్ జట్టుకు తిరిగి రావాలని భావిస్తున్నాడు.

ఇకపోతే ఇప్పటికే ఆర్చర్ అక్టోబర్ - నవంబర్ నెలలో జరగనున్న టీ20 ప్రపంచకప్ టోర్నీకి దూరమైన సంగతి తెలిసిందే. అతను 2021లో UAEలో జరిగిన T20 ప్రపంచ కప్‌కు కూడా మిస్సయ్యాడు. ఇకపోతే ఈ టీ20 ప్రపంచకప్‌లో అక్టోబర్ 22న పెర్త్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో ఇంగ్లాండ్ సూపర్-12లో తొలి మ్యాచ్ ఆడనుంది.

Story first published: Thursday, October 6, 2022, 21:25 [IST]
Other articles published on Oct 6, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+