రీ ఎంట్రీలో దుమ్మురేపుతున్న జోఫ్రా ఆర్చర్ (వీడియో)

లండన్‌: గాయం నుంచి పూర్తిగా కోలుకున్న ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ రీఎంట్రీలో దుమ్మురేపుతున్నాడు. ఈ ఏడాది ప్రారంభం నుంచి గాయాలతో సతమతమవుతూ వచ్చిన ఆర్చర్‌ టీమిండియాతో జరిగిన సిరీస్‌లో మధ్యలోనే వైదొలిగాడు. ఆ తర్వాత జరిగిన ఐపీఎల్‌ 14వ సీజన్‌కు కూడా అందుబాటులో లేకుండా పోయాడు. తాజాగా గాయాల నుంచి కోలుకున్న ఆర్చర్‌ కౌంటీ క్రికెట్‌ ఆడుతూ బిజీగా ఉన్నాడు. ససెక్స్‌ తరపున ఆడుతున్న ఆర్చర్‌ తన వికెట్ల వేటను కొనసాగిస్తున్నాడు.

మొన్న సర్రీతో జరిగిన మ్యాచ్‌లో బనానా ఇన్‌స్వింగర్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌‌ను ఔట్‌ చేసిన ఆర్చర్‌.. తాజాగా మరో అద్బుత బంతితో మెరిశాడు. కెంట్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆర్చర్‌ డానియెల్‌ బెల్‌ రూపంలో తొలి వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత అతని నాలుగో ఓవర్‌లో జాక్‌ క్రాలీని బుట్టలో వేసుకున్నాడు. 143 కిమీ వేగంతో ఆర్చర్‌ విసిరిన ఆ బంతి క్రాలీ బ్యాట్‌ ఎడ్జ్‌ను తాకుతూ వికెట్‌ కీపర్‌ చేతుల్లో నేరుగా పడింది. దీనికి సంబంధించిన వీడియోను ససెక్స్‌ క్రికెట్‌ తన ట్విటర్‌ ఖాతాలో అభిమానులతో పంచుకుంది. 'ఆర్చర్‌ ఆన్‌ ఫైర్‌.. దట్స్‌ ఏ స్నార్టర్‌'అంటూ క్యాప్షన్‌‌గా పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌‌చల్ చేస్తోంది.

కాగా ఆర్చర్‌ త్వరలోనే ఇంగ్లండ్‌ జట్టుతో కలవనున్నాడు. న్యూజిలాండ్‌తో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌తో పాటు టీమిండియాతో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌లోనూ ఆర్చర్‌ అడే అవకాశం ఉంది. అంతేగాక రానున్న టీ20 ప్రపంచకప్‌లో ఆర్చర్‌ ఇంగ్లండ్‌ బౌలింగ్‌ విభాగంలో కీలకం కానున్నాడు. ఐపీఎల్ 2021 సీజన్ రీస్టార్ట్ అయి ఇంగ్లండ్ ప్లేయర్లు పాల్గొంటే రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు. గాయం కారణంగా ఈ సీజన్‌లో అతను ఆడని విషయం తెలిసిందే.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, May 13, 2021, 20:58 [IST]
Other articles published on May 13, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X