For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 2018: జోఫ్రా ఆర్చర్ ఖాతాలో ఓ చెత్త రికార్డు

By Nageshwara Rao
Jofra Archer make a Unwanted Record and became the fourth Player

హైదరాబాద్: జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ బ్యాట్స్‌మన్‌ ఓ చెత్త రికార్డుని నమోదు చేశాడు. ఐపీఎల్ 11వ సీజన్‌ ద్వారా ఐపీఎల్ అరంగేట్రం చేసిన విండిస్ యువ ఆల్‌రౌండర్‌ జోఫ్రా ఆర్చర్‌ మూడు సార్లు డకౌటయ్యాడు.

అయితే, ఇందులో రెండు గోల్డెన్‌ డక్‌లుండటం విశేషం. దీంతో అరంగేట్ర సీజన్‌లో ఇలా మూడు సార్లు డకౌట్‌ అయిన నాలుగో ఆటగాడిగా జోఫ్రా ఆర్చర్ ఓ చెత్త రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు ఐపీఎల్‌ చరిత్రలో ఇలా విన్సెంట్‌ (2011), రామ్‌పాల్‌(2013), గ్రాండ్‌హోమ్‌(2017)లు ఈ రికార్డుని మూటగట్టుకున్నారు.

తాజాగా జోఫ్రా ఆర్చర్‌ ఈ సీజన్‌లో వీరి జాబితాలో చేరాడు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ రాహుల్ త్రిపాఠి (80 నాటౌట్: 58 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులు) హాఫ్ సెంచరీతో రాణించడంతో రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.

మ్యాచ్ ఆరంభంలోనే ఓపెనర్ ఆర్చర్ జోప్రా డకౌటవగా ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రహానె (33: 31 బంతుల్లో 3 ఫోర్లు)తో కలిసి రాహుల్ త్రిపాఠి జట్టు స్కోరు బోర్డుని నడిపించాడు. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కి అభేద్యంగా 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో రాజస్థాన్ భారీ స్కోరు దిశగా సాగింది.

అయితే, ఇన్నింగ్స్ 14వ ఓవర్ వేసిన ఉమేశ్ యాదవ్ వరుస బంతుల్లో రహానె, సంజు శాంసన్ (0)ని పెవిలియన్‌కు చేర్చాడు. చివర్లో త్రిపాఠితో కలిసి హెన్రిచ్ క్లాసెన్ (32: 21 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సు), గౌతమ్ (14: 5 బంతుల్లో 2 సిక్సులు) దూకుడుగా ఆడటంతో రాజస్థాన్ 164 స్కోరు చేయగలిగింది.

దీంతో కోహ్లీసేనకు 165 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. బెంగళూరు బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 3 వికెట్లు తీయగా, హైదరాబాదీ బౌలర్ మహమ్మద్ సిరాజ్‌కు ఒక వికెట్ పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది.

ఆటగాడు జట్టు సంవత్సరం
విన్సెంట్‌ కోచి టస్కర్ 2011
రవి రాంపాల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2013
గ్రాండ్‌హోమ్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్ 2017
జోఫ్రా ఆర్చర్ రాజస్థాన్ రాయల్స్ 2018
Story first published: Saturday, May 19, 2018, 17:51 [IST]
Other articles published on May 19, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+