Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జోఫ్రా ఆర్చర్ వేసిన బౌన్సర్‌కు అలెక్స్ క్యారీ దవడ పగిలింది (వీడియో)

ICC Cricket World Cup 2019 : Aus v Eng : Alex Carey Injured Archers Bowling ! || Oneindia Telugu
Jofra Archer knocks Alex Careys helmet off and draws blood with vicious short ball against Australia

హైదరాబాద్: ప్రపంచకప్‌లో భాగంగా గురువారం ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ జట్లు తలపడుతున్నాయి. ఎడ్జిబాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో సెమీపైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో 14 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆస్ట్రేలియా ఆదుకునేందుకు NO.5 స్థానంలో క్రీజులోకి అలెక్స్ క్యారీ వచ్చాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

అయితే, ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ వేసిన ఇన్నింగ్స్ 8వ ఓవర్ ఆఖరి బంతి ఆస్ట్రేలియా ఆటగాడు అలెక్స్ క్యారీ హెల్మెట్‌ను బలంగా తాకింది. ఆర్చర్ వేసిన బౌన్సర్ అమాంతం అలెక్స్ క్యారీ దవడను బలంగా తాకడంతో అతడి నోటి వెంట రక్తం కారింది. దీంతో మ్యాచ్‌ని అంఫైర్లు కొద్దిసేపు నిలిపివేశారు.

దాంతో క్యారీ రిటైర్ట్‌ హర్ట్‌ అవుతాడని అనుకున్నరంతా. అయితే ప్రాథమిక చికిత్స తర్వాత క్యారీ బ్యాటింగ్‌ కొనసాగించేందుకు మొగ్గు చూపాడు. రక్తం కారుతున్న చోట ప్లాస్టర్‌ వేసుకుని బ్యాటింగ్‌ను యథావిధిగా కొనసాగించాడు.

Jofra Archer knocks Alex Careys helmet off and draws blood with vicious short ball against Australia

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పీకల్లోతు కష్టాల్లో కూరుకు పోయింది. 14 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. నాలుగు పరుగులకే కెప్టెన్ అరోన్ ఫించ్ గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత మరో ఆరు పరుగులకే స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్(9)ను క్రిస్‌వోక్స్ పెవిలియన్‌కు చేర్చాడు.

మరో నాలుగు పరుగులు జోడించిన తర్వాత క్రిస్‌ వోక్స్ మరోమారు ఆస్ట్రేలియాను దెబ్బతీశాడు. ప్రస్తుతం 10 ఓవర్లకు గాను ఆస్ట్రేలియా మూడు వికెట్ల నష్టానికి 27 పరుగులు చేసింది. క్రీజులో స్టీవ్ స్మిత్(4), అలెక్స్ క్యారీ(9) పరుగులు చేశారు.

1
43690

{headtohead_cricket_1_2}

Story first published: Thursday, July 11, 2019, 19:07 [IST]
Other articles published on Jul 11, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+