మూడు మార్పులు: ఇంగ్లాండ్ వరల్డ్‌కప్ జట్టులో జోఫ్రా ఆర్చర్‌కు చోటు

హైదరాబాద్: సొంతగడ్డపై జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్ కోసం ఇంగ్లాండ్ సెలక్టర్లు మంగళవారం 15 మందితో కూడిన తుది జట్టుని ప్రకటించారు. ఈ జట్టులో సెలక్టర్లు అనూహ్యంగా ఆల్ రౌండర్ జోఫ్రా ఆర్చర్‌కు చోటు కల్పించారు. గత నెలలో ఇంగ్లాండ్ సెలక్టర్లు ప్రకటించిన ప్రిలిమినరీ జట్టులో జోఫ్రా ఆర్చర్‌కు చోటు దక్కని సంగతి తెలిసిందే.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

జోఫ్రా ఆర్చర్‌కు చోటు
అయితే, ఐర్లాండ్ సిరిస్‌తో పాటు పాకిస్థాన్‌తో జరిగిన ఐదు వన్డేల సిరిస్‌లో జోఫ్రా ఆర్చర్ అద్భుత ప్రదర్శన చేయడంతో వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఆర్చర్‌తో పాటు సెలక్టర్లు లియామ్ డాసన్, జేమ్స్ విన్సీలను వరల్డ్‌కప్ జట్టులో ఎంపిక చేశారు. ఈ ముగ్గురి స్థానంలో డేవిడ్ విల్లీ, జోయి డేన్లే, అలెక్స్ హేల్స్‌పై వేటు వేశారు.

ఇంగ్లాండ్ తరుపున మూడు వన్డేలు
ఈ ఏడాది మార్చిలో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన జోప్రా ఆర్చర్ ఇప్పటివరకు ఇంగ్లాండ్ తరుపున కేవలం నాలుగు అంతర్జాతీయ మ్యాచ్‌లే(మూడు వన్డేలు, ఒక టీ20) ఆడాడు. అయితే, తన టాలెంట్‌తో ఇప్పుడు వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. వరల్డ్‌కప్ కోసం ఆటగాళ్ల జాబితాను మార్చుకోవడానికి మే 23వ తేదీ వరకు ఆయా క్రికెట్ జట్లకు అవకాశం ఉంది.

తుది జట్టులో స్వల్ప మార్పులు
దీంతో ఇంగ్లాండ్ బోర్డు తుది జట్టులో స్వల్ప మార్పులు చేసింది. జాతీయ సెలక్టర్ ఇద్ స్మిత్ మాట్లాడుతూ జోయి డేన్లేకి బదులు లియామ్ డాసన్‌ను బ్యాకప్ స్పిన్నర్‌గా ఎంపిక చేశామని తెలిపాడు. ఇక, అలెక్స్ హేల్స్ స్థానంలో జేమ్స్ విన్సీని ఎంపిక చేసినట్లు తెలిపాడు. అలెక్స్ హేల్స్ ఇటీవలే డ్రగ్స్ టెస్టులో దొరికిపోయిన సంగతి తెలిసిందే.

వరల్డ్‌కప్‌కు ఇంగ్లాండ్ జట్టు:
ఇయామ్ మోర్గాన్(కెప్టెన్), మొయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్, జానీ బెయిర్ స్టో, జోస్ బట్లర్, టామ్ కర్రన్, లియామ్ డాసన్, లియాం ప్లంకెట్, అదిల్ రషీద్, జో రూట్, జేసన్ రాయ్, బెన్ స్టోక్స్, జేమ్స్ విన్సీ, క్రిస్ వోక్స్, మార్క్ ఉడ్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications