అది వర్ణించలేని బాధ: ప్రపంచకప్‌లో పెయిన్ కిల్లర్స్ తీసుకోవడంపై ఆర్చర్

హైదరాబాద్: జోఫ్రా ఆర్చర్... ఇంగ్లాండ్‌ తొలిసారి విశ్వవిజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించిన ఆటగాడు. లార్డ్స్ వేదికగా జులై 14న సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీని తలపించిన ఫైనల్‌ మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌లో న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసి ఇంగ్లాండ్‌ జట్టుకు విజయాన్ని అందించాడు. తద్వారా 44 ఏళ్ల ఇంగ్లాండ్ కలను సాకారం చేశాడు.

ప్రో కబడ్డీ 7వ సీజన్ వార్తలు, పాయింట్ల పట్టిక కోసం క్లిక్ చేయండి

అయితే, ప్రపంచకప్ టోర్నీ అసాంతం తాను పక్కటెముకల నొప్పితో విలపించినట్లు తాజాగా ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో జోఫ్రా ఆర్చర్ వెల్లడించాడు. జోఫ్రా ఆర్చర్ మాట్లాడుతూ "తీవ్ర నొప్పితో విలవిలలాడాను. అదృష్టవశాత్తు ఆ నొప్పి నుంచి త్వరగానే కోలుకున్నాను. కానీ అది వర్ణించలేని బాధ" అని వివరించాడు.

"ఆప్ఘనిస్థాన్ మ్యాచ్‌ అనంతరం పెయిన్‌ కిల్లర్స్‌ లేనిదే ఆడలేని పరిస్థితి నెలకొంది. కనీసం విశ్రాంతి తీసుకునే పరిస్థితి కూడా లేదు" అని జోఫ్రా ఆర్చర్‌ తెలిపాడు. కాగా, ప్రపంచకప్ ప్రదర్శనతో జోఫ్రా అర్చర్ ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సిరిస్‌కు ఎంపికయ్యాడు. ఇంతవరకు ఒక్క టెస్టు కూడా ఆడని ఆర్చర్ నేరుగా యాషెస్ టెస్టు సిరీస్‌కు ఎంపికయ్యాడు.

ఆస్ట్రేలియాతో స్వదేశంలో ఆగస్టు 1న ప్రారంభమయ్యే యాషెస్ తొలి టెస్టు కోసం 14 మంది సభ్యుల జట్టును ఇంగ్లాండ్‌ సెలక్టర్లు శనివారం ప్రకటించారు. ఈ జట్టుకు జో రూట్‌ కెప్టెన్‌గా వ్యవహారిస్తుండగా... ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌కు మళ్లీ వైస్‌ కెప్టెన్సీ లభించింది. ఐదు టెస్టుల యాషెస్‌ సిరీస్‌ ఆగస్టు 1న ఆరంభమవుతుంది.

యాషెస్ సిరిస్‌కు ఇంగ్లండ్ జట్టు :

జో రూట్(కెప్టెన్), మొయిన్ అలీ, జేమ్స్ అండర్సన్, జోఫ్రా ఆర్చర్, జానీ బెయిర్‌స్టో, స్టువర్ట్ బ్రాడ్, రోరీ బర్న్స్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), సామ్ కరన్, జో జెన్లీ, జేసన్ రాయ్, బెన్ స్టోక్స్, ఒల్లీ స్టోన్స్, క్రిస్ వోక్స్.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Sunday, July 28, 2019, 11:06 [IST]
Other articles published on Jul 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X