
హైదరాబాద్: యాసెష్ సిరీస్ ఓటమి అనంతరం జో రూట్ చెప్పిన కారణాలు చిన్నపిల్లాడి మాటల్ని తలపించాయని ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ ఎద్దేవా చేశాడు. ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే 3-0తో ఆస్ట్రేలియా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఆస్ట్రేలియా చేతిలో యాసెష్ సిరీస్ ఓడిపోవడంతో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్‌పై తీవ్ర విమర్శల వర్షం కురుస్తోంది. ఇంగ్లాండ్ జట్టులోని సీనియర్ అటగాళ్లు అయిన అలిస్టర్ కుక్, స్టువర్ట్ బ్రాడ్‌ల ప్రదర్శనపై ఆదేశ మాజీ క్రికెటర్లు ఇప్పటికే పెదవి విరిచిన సంగతి తెలిసిందే.
తాజాగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ మాట్లాడుతూ 'జో రూట్ గతంలో ఎన్నడూ లేనంత ఒత్తిడిలో ఉన్నాడు. యాషెస్ సిరీస్ పోరు అంటేనే ఇది. అతను ఇప్పటి వరకు ఆడిన క్రికెట్ ఒక ఎత్తు.. యాషెస్ ఒక ఎత్తు. సిరీస్‌లో మ్యాచ్ తీవ్రత.. ఒత్తిడి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. సిరీస్ ఓడిన తర్వాత.. రూట్ చెప్పిన సమాధానాలు చిన్న పిల్లాడి మాటల్లా ఉన్నాయి' అని అన్నాడు.
'ఒక జట్టుకి కెప్టెన్ ఉన్నతంగా మాట్లాడాలి. జట్టు పరాజయాలు చవిచూస్తున్నప్పుడు మరింత హుందాగా ఉండాలి. మనసులో ఎంతైనా బాధ ఉండొచ్చు. కానీ.. ముఖంలో వాటిని చూపించకుండా కనీసం మేనేజ్ చేయడాన్ని రూట్ నేర్చుకోవాలి' అని పాంటింగ్ పేర్కొన్నాడు. ఐదు టెస్టుల యాషెస్ సిరీస్‌లో ఆసీస్ 3-0 ఆధిక్యంలో కొనసాగుతోంది.
కెప్టెన్‌గా రూట్‌కి ఇదే తొలి యాషెస్ టెస్టు సిరిస్ కావడం విశేషం. ఇదిలా ఉంటే ఈ సిరీస్‌లో నాలుగో టెస్టు మెల్‌బోర్న్ వేదికగా మంగళవారం ఆరంభం కానుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.