Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ముక్కోణపు టీ20 సిరిస్ నుంచి జో రూట్ ఔట్

Joe Root rested for T20 Tri-Series between England-Australia-New Zealand

హైదరాబాద్: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లతో ఫిబ్రవరిలో జరిగే ముక్కోణపు టీ20 సిరిస్ నుంచి ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్‌కు విశ్రాంతినిచ్చారు. ఈ సిరిస్ కోసం ఇంగ్లాండ్ ప్రకటించిన 15 మంది జట్టులో జో రూట్ చోటు దక్కించుకున్నాడు. అయితే, కొన్ని వ్యక్తిగత కారణాల వల్లే ఈ టీ20 సిరిస్ నుంచి తాను తప్పుకుంటున్నట్లు జో రూట్ వెల్లడించాడు.

యాషెస్ టెస్టు సిరిస్ ముగిసిన తర్వాత ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సిరిస్‌ ఆడుతోంది. ఐదు వన్డేల సిరిస్‌ను మరో రెండు వన్డేలు ముగిలుండగానే 3-0తో సిరిస్‌ను చేజిక్కించుకుంది. ఆస్ట్రేలియా పర్యటన ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది.

న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా ఇంగ్లాండ్ ఐదు వన్డేల సిరిస్‌తో పాటు రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది. ఈ సిరిస్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ముక్కోణపు టీ20 సిరిస్ ప్రారంభం కానుంది. జో రూట్ మాత్రం ఐదు వన్డేల సిరిస్ ముగిసిన తర్వాత స్వదేశానికి తిరుగు పయనం కానున్నాడు.

అయితే ప్రస్తుతానికి జో రూట్ స్ధానాన్ని మరొక ఆటగాడితో భర్తీ చేయలేదు. విశ్రాంతిపై జో రూట్ మాట్లాడుతూ 'ఈ పర్యనటలో భాగంగా అన్ని మ్యాచ్‌లు ఆడదామనే వచ్చాను. ఇంగ్లాండ్ తరుపున ఆడటాన్ని ఎంతో ప్రేమిస్తా. క్రికెట్‌లో ఏ ఒక్క గేమ్ కూడా మిస్ అవడం ఇష్టం ఉండదు' అని చెప్పాడు.

'విశ్రాంతి విషయమై జట్టు ప్రధాన కోచ్ ట్రెవర్ బేలిస్‌తో సుదీర్ఘంగా మాట్లాడాను. వచ్చేది సమ్మర్ కావడంతో ఎక్కువ క్రికెట్ ఆడాల్సి ఉంటుంది. అన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం ఎంతో ముఖ్యం. అందుకే న్యూజిలాండ్‌తో వన్డే సిరిస్ ముగిసిన తర్వాత విశ్రాంతి కావాలని అడిగా. ఇంట్లో కూర్చున్నప్పటికీ నా మనసంతా ఇంగ్లాండ్ జట్టు గెలవాలనే కోరుకుంటుంది' అని జో రూట్ తెలిపాడు.

ఆస్ట్రేలియాతో మెల్ బోర్న్ వేదికగా జరిగిన తొలి వన్డేలో జో రూట్ 91 పరుగులు చేయగా... గబ్బా స్టేడియంలో జరిగిన రెండో టీ20లో 46 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో జో రూట్ (2/31)తో బౌలింగ్‌లో కూడా మెరిశాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, January 23, 2018, 15:42 [IST]
Other articles published on Jan 23, 2018
Read in English: Root to sit out Tri-Series
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+