న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియాతో తొలి టెస్టుకు బెన్ స్టోక్స్ దూరం..

 Joe Root regrets mic-drop celebration as he insists Ben Stokes will play in first Test despite court case

హైదరాబాద్: ఇప్పటికే పలుమార్లు విచారణకు హాజరైన బెన్ స్టోక్స్‌కు ఇంకా ముగియకపోవడంతో.. అతనికి టీమిండియాతో జరగనున్న తొలి టెస్టుకు ఆడేందుకు అవాంతరం ఎదురైంది. ఈ క్రమంలో వచ్చే నెల 1 నుంచి 5 వరకు భారత్‌తో బర్మింగ్‌హామ్‌లో జరిగే తొలి టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్, డైనమిక్ మిడిల్ ఫీల్డర్ బెన్ స్టోక్స్ ఆడే అవకాశం కనిపించట్లేదు.

గతేడాది సెప్టెంబర్‌లో బ్రిస్టోల్‌లోని నైట్‌క్లబ్ బయట జరిగిన ఒక సంఘటనలో బాధ్యుడిని చేస్తూ బెన్‌స్టోక్స్‌ను ప్రాసిక్యూషన్ విచారణకు ఆదేశించింది. గతేడాది బెన్ స్టోక్స్, అలెక్స్ హేల్స్ ఇద్దరూ నైట్ క్లబ్ బయటి ఓ వివాదంలో ఇరుక్కున్నారు. ఆ వివాదం అక్కడి సీసీ ఫుటేజీలలో కూడా రికార్డు అయింది. ఈ విషయంపైనే ప్రాసిక్యూషన్ ఇప్పటికే పలుమార్లు విచారణ నిర్వహించింది.

ఇదే సమయంలో భారత్ ఆతిధ్య ఇంగ్లాండ్‌తో ఆడే ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆగస్టు 1 నుంచి తొలి మ్యాచ్‌ను ఆడనుంది. బెన్‌స్టోక్స్ కేసు ఆగస్టు 6న విచారణ రానుండడంతో తొలి మ్యాచ్‌లో అతను ఆడే అవకాశాలు లేకపోవచ్చని తెలుస్తోంది. మిగిలిన నాలుగు టెస్టు మ్యాచ్‌లలో మాత్రం బెన్ స్టోక్స్ ఆడతాడు. భారత్‌తో జరిగిన వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ 2-1తో ఇంగ్లాండ్ చేజిక్కించుకోవడంలో బెన్‌స్టోక్స్ కీలకంగా మారాడు.

ఇదిలావుండగా, ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ మాత్రం కోర్టు కేసు నుంచి బెన్ స్టోక్ బయటపడతాడని విశ్వసిస్తున్నాడు. ఇదిలా ఉంటే, ఇంగ్లాండ్ టెస్టు జట్టులోకి అదిల్ రషీద్‌ను తీసుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. టీమిండియాతో జరిగిన మూడో వన్డేలో ప్రధానమైన కెప్టెన్ వికెట్ తీయడంతో.. రషీద్‌ను జట్టులోకి తీసుకుంటే జట్టును కట్టడి చేయొచ్చన్నట్లు యోచిస్తోంది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు.

Story first published: Friday, July 20, 2018, 14:36 [IST]
Other articles published on Jul 20, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X