For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జో రూట్ అరుదైన ఘ‌న‌త‌.. ఆ జాబితాలో థ‌ర్డ్ ప్లేస్ కైవ‌సం

Joe Root ranks third on the list of most runs in calendar year

బాక్సింగ్ డే టెస్టులో ఇంగ్లండ్ ఓట‌మి పాలైన‌ప్ప‌టికీ ఆ జ‌ట్టు కెప్టెన్ రూట్ ఓ అరుదైన ఘ‌న‌త‌ను సాధించాడు. టెస్టు క్రికెట్‌లో ఒకే క్యాలెండ‌ర్ ఇయ‌ర్‌లో ఎక్కువ ప‌రుగులు చేసిన బ్యాట‌ర్ల జాబితాలో రూట్ మూడో స్థానంలో నిలిచాడు. ఈ ఏడాది 15 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన రూట్ 29 ఇన్నింగ్స్‌లో 61 స‌గ‌టుతో 1,708 ప‌రుగులు చేశాడు. ఇందులో 6 సెంచ‌రీలు, 4 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. అత్య‌ధిక స్కోర్ 228. అయితే రూట్ మ‌రొక 3 ప‌రుగులు చేసి ఉంటే ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్న వెస్టిండీస్ దిగ్గ‌జం వివి రిచ‌ర్డ్స్ రికార్డును బ్రేక్ చేసేవాడు.

1976లో రిచ‌ర్స్ 90 స‌గ‌టుతో 1710 ప‌రుగులు చేశాడు. ఇందులో 7 సెంచ‌రీలు, 5 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. అత్య‌ధిక స్కోర్ 291. ఇక ఈ స్థానంలో పాకిస్థాన్ మాజీ బ్యాట‌ర్ మహ్మద్ యూసుఫ్ అంద‌రి కంటే ముందున్నాడు. 2006లో 11 టెస్టు మ్యాచ్‌లు ఆడిన యూసుఫ్ ఏకంగా 99 స‌గ‌టుతో 1788 ప‌రుగులు చేశాడు. ఇందులో 9 సెంచ‌రీలు, 3 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. అత్య‌ధిక స్కోర్ 202.

యాషెస్ సిరీస్ 2021లోని బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 50 ప‌రుగులు చేయ‌డం ద్వారా సౌతాఫ్రికా దిగ్గ‌జం గ్రేమ్ స్మిత్ రికార్డును బ్రేక్ చేసి రూట్ మూడో స్థానానికి చేరుకున్న సంగ‌తి తెలిసందే. దీంతో ప్ర‌స్తుతం 1656 ప‌రుగుల‌తో స్మిత్ నాలుగో స్థానంలో ఉన్నాడు. కాగా ఈ జాబితాలో టీమిండియా దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్ ఆరో స్థానంలో ఉన్నాడు. 2010లో 78 స‌గ‌టుతో స‌చిన్ 1562 ప‌రుగులు చేశాడు. ఇందులో 7 సెంచ‌రీలు, 5 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. అత్య‌ధిక స్కోర్ 214 ప‌రుగులు.

త‌న కెరీర్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 112 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్ 49 స‌గ‌టుతో 9,531 ప‌రుగులు చేశాడు. ఇందులో 23 సెంచ‌రీలు, 53 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. 5 సార్లు డ‌బుల్ సెంచ‌రీ మార్క్‌ను కూడా అందుకున్నాడు. అత్య‌ధిక స్కోర్ 254 ప‌రుగులు. ఇక 152 వ‌న్డే మ్యాచ్‌లు ఆడిన రూట్ 51 స‌గ‌టుతో 6109 ప‌రుగులు చేశాడు. ఇందులో 16 సెంచ‌రీలు, 35 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. అత్య‌ధిక ప‌రుగులు 133. అలాగే 32 టీ20 మ్యాచ్‌లు ఆడి 35 స‌గ‌టుతో 893 ప‌రుగులు చేశాడు. ఇందులో 5 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. అత్య‌ధిక స్కోర్ 90 ప‌రుగులు.

Story first published: Tuesday, December 28, 2021, 14:10 [IST]
Other articles published on Dec 28, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+