Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చారిత్రక విజయంతో సంబరాల్లో ఇంగ్లాండ్ జట్టు

Joe Root Plays Guitar In Dressing Room As England Celebrate Clean Sweep vs Sri Lanka

హైదరాబాద్: జో రూట్‌ నేతృత్వంలోని ఇంగ్లాండ్‌ టెస్టు జట్టు చారిత్రక విజయం సాధించింది. 55 ఏళ్ల విరామం తర్వాత విదేశాల్లో టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. శ్రీలంకను దాని సొంతగడ్డపై 3-0తో ఓడించింది. సోమవారం ముగిసిన చివరి టెస్టులో ఇంగ్లాండ్‌ 42 పరుగుల తేడాతో గెలిచింది. 327 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక.. రెండో ఇన్నింగ్స్‌లో 284 పరుగులకు ఆలౌటైంది. తొలి రెండు టెస్టుల్లోనూ భారీ తేడాతో ఇంగ్లాండే విజయం సాధించిన సంగతి తెలిసిందే.

చర్చనీయాంశంగా మారిన స్పిన్నర్ సందకన్ బౌలింగ్‌

చర్చనీయాంశంగా మారిన స్పిన్నర్ సందకన్ బౌలింగ్‌

దీంతో విదేశాల్లో తొలిసారిగా టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన ఇంగ్లాండ్‌ జట్టుగా జో రూట్‌ సేన చరిత్ర సృష్టించింది. కొలంబో వేదికగా ఇంగ్లాండ్‌‌తో ముగిసిన మూడో టెస్టు మ్యాచ్‌లో శ్రీలంక స్పిన్నర్ సందకన్ బౌలింగ్‌ చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు అయిన శ్రీలంక నోబాల్స్ కారణంగా అభాసుపాలైంది. ఆటలో నాలుగో రోజైన సోమవారం తొలి సెషన్‌లో ఐదు ఓవర్లు బౌలింగ్ చేసిన సందకన్.. ఏకంగా 12 బంతుల్ని నోబాల్‌గా విసిరాడు.

రెండు బంతుల్ని మాత్రమే అంపైర్లు నోబాల్‌గా

రెండు బంతుల్ని మాత్రమే అంపైర్లు నోబాల్‌గా

ఇందులో కేవలం రెండు బంతుల్ని మాత్రమే అంపైర్లు నోబాల్‌గా గుర్తించారు. ఈ రెండు బంతుల్లోనూ ఒక బంతికి ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ ఔట్ కావడం విశేషం. సందకన్ బౌలింగ్ తీరుపై కెప్టెన్ లక్ష్మల్ అసహనం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో నో బాల్స్ వేయకుండా బౌలింగ్ చేయాలంటూ అతనితో కెప్టెన్ పలుమార్లు చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. సిరీస్‌ విజయానంతరం ఇంగ్లిష్‌ ఆటగాళ్లు తమ డ్రెసింగ్‌ రూమ్‌లో సంబరాలు చేసుకున్నారు.

జో రూట్‌ గిటార్‌ వాయిస్తూ సహచర ఆటగాళ్లను

కెప్టెన్ జో రూట్‌ గిటార్‌ వాయిస్తూ సహచర ఆటగాళ్లను ఉత్సాహపరుస్తూ సందడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను ఇంగ్లాండ్‌ క్రికెట్‌ తమ ట్విటర్‌ ఖాతా ద్వారా పంచుకుంది. ఆసియా గడ్డపై టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన తొలి ఇంగ్లాండ్‌ జట్టు ఇదేనంటూ ట్వీట్ చేసింది.

ఇన్నేళ్లకు మళ్లీ విదేశాల్లో సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌

ఇన్నేళ్లకు మళ్లీ విదేశాల్లో సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌

చివరగా 1963లో న్యూజిలాండ్‌ గడ్డపై 3-0తో సిరీస్‌ విజయం సాధించిన ఇంగ్లాండ్‌.. ఇన్నేళ్లకు మళ్లీ విదేశాల్లో సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. కాగా ఈ పర్యటనలో ఇంగ్లాండ్‌ ముందుగా వన్డే సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకోగా, ఏకైక టీ20లోనూ ఆ జట్టే విజయం సాధించింది. ఇక టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో 211పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదుచేసుకోగా, రెండో టెస్టులోనూ 57పరుగుల తేడాతో గెలిచింది.

Story first published: Tuesday, November 27, 2018, 14:38 [IST]
Other articles published on Nov 27, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+