Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హమ్మయ్యా.. కోహ్లి చెత్త రికార్డును బ్రేక్ చేసిన జో రూట్- ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ!

ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ ఖాతాలో మరో రికార్డు నమోదైంది. స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి- స్టీవ్ స్మిత్ రికార్డులను అధిగమించాడు. తన టెస్టు కెరీర్‌లో 150వ మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. అయితే కోహ్లి- స్మిత్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ హ్యాపీ‌గా ఉన్నారు. ఎందుకంటే.. ఏ క్రికెటర్ కోరుకోని రికార్డును జో రూట్ అందుకున్నాడు.

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక డకౌట్లు సాధించిన ఫ్యాబ్-4 బ్యాటర్‌గా రూట్ చెత్త రికార్డు సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు విరాట్ కోహ్లి, ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ పేరిట ఉండేది. వీరిద్దరూ డబ్ల్యూటీసీలో ఏడు సార్లు డకౌటయ్యారు. జోరూట్ ఎనిమిది సార్లు డకౌటై ఈ చెత్త రికార్డు అందుకున్నాడు.

Joe Root Overtakes Virat Kohli and Steve Smith in Unwanted Milestone After Duck in 150th Test

ముల్తాన్ వేదికగా పాకిస్థాన్‌‌పై డబుల్ సెంచరీ సాధించిన తర్వాత జో రూట్ నిలకడగా పరుగులు సాధించలేకపోతున్నాడు. గత అయిదు టెస్టు ఇన్నింగ్స్‌లో 90 పరుగులే చేశాడు. తాజాగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో నాలుగు బంతులు ఎదుర్కొని ఖాతా తెరవకముందే పెవిలియన్‌కు చేరాడు. అయితే 150వ టెస్టులో డకౌటైన మూడో బ్యాటర్‌గా జో రూట్ మరో కోరుకోని రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. స్టీవ్ వా (2002లో పాకిస్థాన్‌పై), రికీ పాంటింగ్ (2010లో ఇంగ్లండ్‌పై) తమ 150వ టెస్టులో గోల్డెన్ డకౌటయ్యారు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. హాగ్లీ ఓవల్ వేదికగా న్యూజిలాండ్ - ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. రెండో రోజు ఆట ముగిసేసరికి పర్యాటక జట్టు ఇంగ్లండ్ 74 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి 319 పరుగులు చేసింది. యువ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ (132 బ్యాటింగ్; 163 బంతుల్లో, 10 ఫోర్లు, 2 సిక్సర్) అజేయ శతకంతో కదం తొక్కాడు. అతనికి తోడుగా కెప్టెన్ బెన్ స్టోక్స్ (37; 76 బంతుల్లో, 4 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. కివీస్ కంటే ఇంగ్లండ్ 29 పరుగుల వెనుకంజలో ఉంది.

ఒలీ పోప్ (77; 98 బంతుల్లో, 8 ఫోర్లు), బెన్ డకెట్ (46; 62 బంతుల్లో, 6 ఫోర్లు) రాణించారు. కాగా, ఓవర్‌నైట్ స్కోరు 319/8తో ఇవాళ ఆట ఆరంభించిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 91 ఓవర్లకు 348 పరుగులకు ఆలౌటైంది. గ్లెన్ ఫిలిప్స్ (58 నాటౌట్; 87 బంతుల్లో, 6 ఫోర్లు, 1 సిక్సర్) అజేయ అర్ధశతకంతో జట్టుకు కీలక పరుగులు అందించాడు. కేన్ విలియమ్సన్ (93; 197 బంతుల్లో, 10 ఫోర్లు) టాప్ స్కోరర్. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రిడన్ కార్స్, షోయబ్ బషీర్ చెరో నాలుగు వికెట్లు, అట్కిన్సన్ రెండు వికెట్లు తీశారు.

Story first published: Friday, November 29, 2024, 14:47 [IST]
Other articles published on Nov 29, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+