హైదరాబాద్: ఇంగ్లాండ్ టెస్టు జట్టుకు కొత్త కెప్టెన్ వచ్చాడు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ జో రూట్ ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఈ మేరకు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు సోమవారం అధికారిక ప్రకటన చేసింది. గత వారం ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్సీ నుంచి అలెస్టర్ కుక్ తప్పుకున్న సంగతి తెలిసిందే.
అతడి స్ధానంలో 26 ఏళ్ల జో రూట్‌ని ఎంపిక చేసినట్లు ఈసీబీ వెల్లడించింది. ఇంగ్లాండ్ జట్టుకు జో రూట్ 80వ టెస్టు కెప్టెన్. ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ వైస్ కెప్టెన్‌గా వ్వవహరించనున్నాడు. కెప్టెన్సీ పగ్గాలుపై జో రూట్ మీడియాతో మాట్లాడుతూ ఇదొక గొప్ప గౌరవమని చెప్పాడు.

2012లో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన జో రూట్ అలెస్టర్ కుక్ కెప్టెన్సీలో 2015లో వైస్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. 52.80 యావరేజితో 11 టెస్టు సెంచరీలు సాధించిన జో రూట్ ప్రస్తుతం ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో మూడో స్ధానంలో కొనసాగుతున్నాడు.
ఇటీవలే భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టు 4-0తో టెస్టు సిరిస్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. చెన్నై టెస్టులో ఓటమి పాలైన తర్వాత అలెస్టర్ కుక్ జో రూట్‌ను కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలంటూ పేర్కొన్న సంగతి తెలిసిందే. తమ భవిష్య కెప్టెన్ రూట్ అంటూ కుక్ పేర్కొన్నాడు.
కుక్ చెప్పినట్లే జో రూట్‌ని కెప్టెన్ నియమితుడయ్యాడు. ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన జో రూట్ ప్రతీ ఒక్కరికీ అత్యంత గౌరవం ఇచ్చే ఆటగాడని మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్ కొనియాడటం విశేషం.