కెప్టెన్సీలో కోహ్లీని ఉదాహరణగా తీసుకో: రూట్‌కు వాన్
హైదరాబాద్: ఇంగ్లాండ్ టెస్టు జట్టుకు కెప్టెన్‌గా జో రూట్‌ని నియామకాన్ని ఆ దేశ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ సమర్ధించాడు. విరాట్ కోహ్లీ ఎలాగైతే టీమిండియాకు విజయాలను అందిస్తున్నాడో అదే విధంగా భవిష్యత్‌లో జో రూట్ ఇంగ్లాండ్ చిరస్మరణీయ విజయాలు అందిస్తాడన్నాడు.
అలెస్టర్ కుక్ ఇటీవల కెప్టెన్సీకి రాజీనామా చేయడంతో వైస్ కెప్టెన్‌గా ఉన్న జో రూట్‌ని ఈసీబీ కెప్టెన్‌గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. జో రూట్ కూడ్ అచ్చం వాన్ బాటలోనే పయనిస్తున్నాడు. తొలుత షెఫీల్డ్ కాలేజ్గేట్ క్లబ్‌కు తరుపున ఆడిన వీరిద్దరూ ఆ తర్వాత యార్క్ షైర్, ఇంగ్లాండ్ జట్టుకు ఆడుతున్నారు.

జో రూట్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడానికి ఇదే సరైన సమయం
కాగా, 2005 యాషెస్ సిరీస్ విజేతగా ఇంగ్లాండ్ నిలిచినప్పుడు జట్టుకు మైకెల్ వాన్ కెప్టెన్‌గా ఉన్నాడు. 26 ఏళ్ల జో రూట్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడానికి ఇదే సరైన సమయమని ఇందులో ఎలాంటి సందేహం లేదని వాన్ స్పష్టం చేశాడు.

జో రూట్ రెడీ, ఎలాంటి సందేహం లేదు
జో రూట్ రెడీ, ఎలాంటి సందేహం లేదు' అని డైలీ టెలిగ్రాఫ్‌కు రాసిన కాలమ్‌లో వాన్ పేర్కొన్నాడు. కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తిస్తూనే జో రూట్ ఆటలో మరింత నైపుణ్యం సాధించాల్సి ఉందని వాన్ పేర్కొన్నాడు. మరోవైపు జో రూట్, విరాట్ కోహ్లీ పోలికపై కూడా వాన్ స్పందించాడు.

కోహ్లీపై ప్రశంసలు
టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాతనే కోహ్లీ ఎక్కువ పరుగులు చేస్తున్నాడని, ఇందులో రెండు డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయని వాన్ గుర్తుచేశాడు. కోహ్లీ భారత్‌కు దొరికిన పెద్ద వరం. అతడి అద్భుత ప్రతిభతో భారత్‌ను టెస్టు ర్యాంకింగ్స్ అగ్రస్థానంలో నిలిపాడని కొనియాడాడు.

జో రూట్ బ్యాటింగ్‌లో మెరుగైన ప్రదర్శన చేయాలి
విరాట్ కోహ్లీ మాదిరిగా జో రూట్ కూడా అటు బ్యాటింగ్‌తో పాటు కెప్టెన్సీలో ఇంగ్లాండ్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాడనే ఆశాభావాన్ని వాన్ వ్యక్తం చేశాడు. కాగా, జో రూట్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినప్పటికీ బ్యాటింగ్‌లో మెరుగైన ప్రదర్శన చేయాలని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications