ఇంగ్లాండ్‌కు కష్టమే: వన్డే సిరీస్‌కి జో రూట్ దూరం?
హైదరాబాద్: జనవరి 15 నుంచి భారత్‌తో ప్రారంభంకానున్న మూడు వన్డేల సిరిస్‌కు ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ జో రూట్ దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తన ప్రేయసి క్యారీ కాటెరెట్ ప్రస్తుతం గర్భవతిగా ఉండటంతో ప్రసవ సమయంలో ఆమె వద్ద ఉండేందుకు జో రూట్ తొలి వన్డేకు అందుబాటులో లేకపోవచ్చు.
తన ప్రేయసి ప్రసవం తర్వాత అంటే జనవరి చివరి వారంలో జో రూట్ ఇండియాకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ది మెయిల్ పత్రిక కథనం ప్రకారం దాదాపు రెండేళ్లకుపైగా సహజీవనం చేసిన వీరిద్దరూ గతేడాది జరిగిన టీ20 వరల్డ్ కప్ సమయంలో నిశ్చితార్థం చేసుకున్నారు.
ధోని నేతృత్వంలోని టీమిండియా ఇంగ్లాండ్ జట్టుతో మూడు వన్డేల సిరీస్, మూడు టీ20ల సిరీస్‌లను ఆడనుంది. తొలి వన్డే మ్యాచ్ జనవరి 15న పూణెలో ప్రారంభం కానుంది. ఇటీవలే ముగిసిన ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 4-0తో భారత్ గెలుచుకున్న సంగతి తెలిసిందే.
దీంతో పరిమిత ఓవర్ల ఫార్మెట్‌లోనైనా ఇంగ్లాండ్ సత్తాచాటాలని ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న జో రూట్ జట్టుకు ఆందోళన కలిగించే అంశమే. కాగా, జో రూట్ ఎన్ని మ్యాచ్‌లకు దూరమయ్యేది మాత్రం ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications