చెన్నై టెస్టు: రికార్డు మిస్ అయిన ఆ ఇద్దరు ఎవరు?
చెన్నై: ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదో టెస్టు చెన్నైలోని చిదంబరం స్టేడియంలో శుక్రవారం (డిసెంబర్ 16)న ప్రారంభమైంది. తొలిరోజు ఆటలో భాగంగా ఓ అరుదైన రికార్డుకు ఇద్దరు ఇంగ్లాండ్ ఆటగాళ్లు అత్యంత చేరువగా వచ్చి అందుకోవడంలో విఫలమయ్యారు.
ఆ రికార్డు ఏమిటంటే ఇంగ్లాండ్ తరపున ఒక ఏడాది అత్యధిక పరుగులు రికార్డును నెలకొల్పే అవకాశాన్ని తొలుత జో రూట్ కోల్పోగా, ఆ తర్వాత అదే రికార్డుని బెయిర్ స్టో కూడా మిస్సయ్యాడు. 2002లో ఇంగ్లాండ్ జట్టు తరపున టెస్టుల్లో ఒక క్యాలెండర్ అత్యధిక పరుగులు చేసిన రికార్డు మాజీ కెప్టెన్ మైకేల్ వాన్(1481) పేరిట ఉంది.

ఒక కేలండర్ ఇయర్‌లో అత్యధిక పరుగుల రికార్డు
అదే ఇంగ్లాండ్ జట్టు తరుపున ఒక కేలండర్ ఇయర్‌లో అత్యధిక పరుగుల రికార్డుగా ఉంది. అయితే ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో జో రూట్ చెన్నై టెస్టులో ఆ రికార్డుకు పది పరుగుల దూరంలో నిలిచిపోయాడు. మరోవైపు బెయిర్ స్టో 12 పరుగుల దూరంలో ఆ మైలురాయిని అందుకునే క్రమంలో పెవిలియన్‌కు చేరాడు.

ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో జో రూట్ 88 పరుగుల వద్ద అవుట్
చెన్నోలో జరుగుతున్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో జో రూట్ 88 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరాడు. ఇక బెయిర్‌స్టో 49 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ కావడంతో అర్ధ సెంచరీ నమోదు చేసిన అవకాశం కోల్పోయాడు. జడేజా వేసిన బౌలింగ్‌లో కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

3 సెంచరీలు, 8 అర్ధ సెంచరీలతో 1469 పరుగులు
తద్వారా 2016లో బెయిర్ స్టో 3 సెంచరీలు, 8 అర్ధ సెంచరీలతో 1469 పరుగులు నమోదు చేయగా, జో రూట్ మూడు సెంచరీలు, 10 హాఫ్ సెంచరీ సాయంతో 1471 పరుగులు నమోదు చేశారు. దాంతో ఒక కేలండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన ఇంగ్లాండ్ ఆటగాళ్లలో రూట్, బెయిర్ స్టోలు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.

చెన్నైలో టెస్టులో అరుదైన ఘనత సాధించిన జో రూట్
చెన్నై టెస్టులో జో రూట్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ సిరీస్‌లో అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్న జో రూట్ యాభై, అంతకంటే ఎక్కువ పరుగులను ఐదుసార్లు సాధించాడు. తద్వారా 35 ఏళ్ల రికార్డును జో రూట్ అధిగమించాడు. భారత్‌లో ఒక సిరీస్‌లో ఓ విదేశీ ఆటగాడు యాభై , అంతకుమించి పరుగులు చేయడం 1981 తరువాత ఇదే తొలిసారి.

రాజ్ కోట్ టెస్టులో సెంచరీ
రాజ్ కోట్ టెస్టులో సెంచరీ చేసిన జోరూట్ రెండో టెస్టులో అర్ధ సెంచరీ సాధించాడు. ఆపై మూడు, నాలుగు టెస్టుల్లో అర్ధ సెంచరీలు సాధించాడు. ప్రస్తుతం చెన్నైలో జరుగుతున్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో జో రూట్ 88 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు చేరాడు. అంతకుముందు భారత్‌లో చివరిసారి ఇదే తరహాలో ఒక సిరీస్‌లో సెంచరీతో పాటు, నాలుగు అర్ధ సెంచరీలు చేసిన విదేశీ ఆటగాళ్లలో ఇయాన్ బోథమ్, గ్రాహమ్ గూచ్‌లు ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications