Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చరిత్ర సృష్టించిన జో రూట్.. ద్రవిడ్ రికార్డు బ్రేక్!

వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ ఆధిపత్యం చెలాయిస్తోంది. రెండో రోజు ఆట ముగిసేసరికి 76 ఓవర్లకు ఇంగ్లండ్ అయిదు వికెట్లకు 378 పరుగులు చేసింది. జాకబ్ బెథెల్ (96; 118 బంతుల్లో, 10 ఫోర్లు, 3 సిక్సర్లు), బెన్ డకెట్ (92; 112 బంతుల్లో, 6 ఫోర్లు, 1 సిక్సర్), జో రూట్ (73* బ్యాటింగ్; 106 బంతుల్లో, 5 ఫోర్లు), హ్యారీ బ్రూక్ (55; 61 బంతుల్లో, 5 ఫోర్లు) సత్తాచాటారు.

టిమ్ సౌథి, మ్యాట్ హెన్రీ చెరో రెండు వికెట్లు తీశారు. న్యూజిలాండ్ కంటే ఇంగ్లండ్ 533 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది. మొదటి ఇన్నింగ్స్‌లో కివీస్ 34.5 ఓవర్లలో 125 పరుగులకే కుప్పకూలింది. కేన్ విలియమ్సన్ (37; 56 బంతుల్లో, 3 ఫోర్లు) టాప్ స్కోరర్. కెప్టెన్ లాథమ్ (17; 32 బంతుల్లో, 1 ఫోర్), టామ్ బ్లండెల్ (16; 20 బంతుల్లో, 2 ఫోర్లు), గ్లెన్ ఫిలిప్స్ (16; 16 బంతుల్లో, 3 ఫోర్లు) పరుగులు చేశారు. అట్కిన్సన్ (4/31) హ్యాట్రిక్‌తో సహా నాలుగు వికెట్లు పడగొట్టాడు. బ్రైడన్ కార్స్ (4/46) నాలుగు, స్టోక్స్ (1/21), వోక్స్ (1/26) తలో వికెట్ తీశారు.

Joe Root Joins Elite Club with 100 50 Scores in Test Cricket

మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 280 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. అయితే రెండో ఇన్నింగ్స్‌లో అజేయంగా నిలిచిన జో రూట్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో 100 సార్లు 50+ స్కోరు సాధించిన నాలుగో బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. రూట్ కంటే ముందు ఈ ఘనతను సచిన్ టెండూల్కర్, జాక్వస్ కలిస్, రికీ పాంటింగ్ మాత్రమే సాధించారు. సచిన్ 200 మ్యాచ్‌ల్లో 119 సార్లు (68 హాఫ్ సెంచరీలు + 51 సెంచరీలు); కలిస్ 103 సార్లు (58 హాఫ్ సెంచరీలు + 45 సెంచరీలు); పాంటింగ్ 103 సార్లు (62 హాఫ్ సెంచరీలు + 41 సెంచరీలు) సాధించాడు.

జో రూట్ 151 మ్యాచ్‌ల్లో 65 హాఫ్ సెంచరీలు, 35 సెంచరీలు సాధించాడు. ఈ క్రమంలో ఓవరాల్‌గా 50+ స్కోరు అత్యధిక సార్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రాహుల్ ద్రవిడ్‌ను రూట్ అధిగమించాడు. ద్రవిడ్ 99 సార్లు 50+ స్కోరు నమోదుచేశాడు. 164 టెస్టుల్లో ద్రవిడ్ 63 అర్ధశతకాలు, 36 శతకాలు బాదాడు. ద్రవిడ్ తర్వాతి స్థానాల్లో చంద్రపాల్ 96 సార్లు (66 హాఫ్ సెంచరీలు + 30 సెంచరీలు); కుమార సంగక్కర 90 సార్లు (52 హాఫ్ సెంచరీలు + 38 సెంచరీలు); అలెన్ బోర్డర్ 90 సార్లు (63 హాఫ్ సెంచరీలు + 27 సెంచరీలు) ఉన్నారు.

Story first published: Saturday, December 7, 2024, 12:30 [IST]
Other articles published on Dec 7, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+